Muncipal workers | Hyderabad | KCR | Telangana | Contract employees, premenent

A muncipal worker questions the kcr and his govt

Muncipal workers, Hyderabad, KCR, Telangana, Contract employees, premenent

A muncipal worker questions the KCR and his govt. Muncipal employees strike for their demands but telangana govt didnt agree for those demands.

ITEMVIDEOS: కేసీఆర్ తాట తీసిన మున్సిపల్ మహిళా వర్కర్

Posted: 07/14/2015 09:59 AM IST
A muncipal worker questions the kcr and his govt

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎవరైనా సరే మాటల తూటాలు పేలద్దామని అనుకుంటే అస్సలు కుదరుద. ఎందుకంటే కేసీఆర్ వాగ్దాటి గురించి అందరికి తెలుసు. ఆయన తన మీద విమర్శలు చేసిన వారిని ఏ స్థాయిలో విమర్శిస్తారో.. ఎంత మంచి పదజాలాన్ని వాడుతారో అందరికి తెలుసు. అయితే అందరికి అన్ని రోజులు కలిసి రావు. వీధిలో ఉన్న పంట కుప్పకు కూడా ఓ రోజు వస్తుందన్నట్లు.. కేసీఆర్ ను నిలదీసే వాళ్లు కూడా ఉంటారు కాకపోతే టైం రావాలి అంతే తాటతీస్తారు. తాజాగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  మున్సిపల్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురించి అందరికి తెలుసు. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం వారి డిమాండ్ లకు అనుకూలంగా స్పందించడంలేదు. పైగా విధుల్లోకి చేరుతారా..? లేదా తీసివెయ్యాలా..? అంటూ హుకుం కూడా జారీ చేస్తుండటంతో ఉత్కంఠట నెలకొంది.

మురుగు అంటేనే భయపడే, విసుక్కునే జనం బాధలు తీర్చడానికి.. ఎంత కంపు కొడుతున్నా కానీ మురుగును తీసివేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ద కార్మికుల మీద ప్రభుత్వం చూపిస్తున్న చిన్న చూపు మీద ఓ కార్మికురాలు గొంతెత్తింది. కేసీఆర్ చేసిందేముంది..? ముందు తెలంగాణ రావాలె.. రావాలె అని అన్నారు. వచ్చినంక మున్సిపల్ ఉద్యోగులను ముందు పర్మినెంట్ చేస్తామన్నరు..? కానీ ఏం చేశిండ్రు..? పోలీసులకు మాత్రం మస్తు చేస్తుండరు... ఇంటింటికి ఉద్యోగం అన్నరు.. కానీ అదంత చెప్పుడు వరకే.. చేసిందేమీ లేదు..! ఇలా ఓ మహిళా వర్కర్ మాట్లాడుతుంటే చప్పట్ల మోత మోగింది.

అయినా కడుపు మండితే కేసీఆర్ లేదు తాత లేదు. అందుకే మున్సిపల్ ఉద్యోగిని కేసీఆర్ ను నిలదీశారు.  ఉద్యమ సమయంలో ఎడా పెడా హామీలిచ్చి ఇప్పుడు మాత్రం అధికారంలోకి వచ్చాక మీనవేషాలు లెక్కిస్తున్నారు. అయితే కేసీఆర్ అధికారంలోకి వస్తే అందరిని పర్మినెంట్ చేస్తానని, అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కానీ కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చెయ్యండి అంటే మాత్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. కమిటి వేశాం .. రిపోర్ట్ రావాలి అంటూ రకరకాల కారణాలు చెబుతున్నారు. మున్సిపల్ ఉగ్యోగులు వెంటనే విధుల్లో చేరాలని అలా లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురుకోవాలి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడుపుతామని చెప్పిన కేసీఆర్.. ఎంప్లాయిస్ కు అగెనిస్ట్ గా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

By Abinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muncipal workers  Hyderabad  KCR  Telangana  Contract employees  premenent  

Other Articles