Madhu | Vanajakshi | Ashok Babu | Chintamaneni Prabhakar, Sand Mafia

Cpi leader madhu questions ap ngos leader ashokbabu for his silence on vanajakshis attack issue

Madhu, Vanajakshi, Ashok Babu, Chintamaneni Prabhakar, Sand Mafia

CPI leader Madhu questions ap ngos leader AshokBabu for his silence on Vanajakshis attack issue.

అశోక్ బాబు మాట్లాడవేం..? బాబుకు వత్తాసా?

Posted: 07/11/2015 03:52 PM IST
Cpi leader madhu questions ap ngos leader ashokbabu for his silence on vanajakshis attack issue

ఏపిలో ఓ ఎమ్మార్వో మీద దాడి జరిగింది.. రెవెన్యూ ఉద్యోగులు ఎమ్మెల్యేను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చివరకు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. అయితే ఏపి సిఎం చంద్రబాబు నాయుడు పరిస్థితిని స్వయంగా సమీక్షించి.. దాడికి గురైన ఎమ్మార్వో వనజాక్షితో మాట్లాడారు. ఘటన మీద విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంత సీన్ జరుగుతున్నా కానీ ఏపి ఎన్జీవో నేత అశోక్ బాబు మాత్రం కనీసం ఖండిస్తున్నట్లు కూడా ప్రకటన చెయ్యలేదు. ఉద్యోగ సంఘాల నేతగా ఉంటూ కనీసం దాడిని వ్యతిరేకిస్తున్న కూడా ప్రకటన చెయ్యకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమయింది. అయితే సిపిఎం ఏపి రాష్ట్రకార్యదర్శి మధు అశోక్ బాబు వైఖరిపై అసహనం వ్యకతం చేశారు.ఎమ్మార్వో వనజాక్షి మీద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి గురించి మౌనంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు.

నిజానికి అశోక్ బాబు ఏపి ఉద్యోగుల కోసం ఎంతకైనా తెగిస్తాను, ఎవరితోనైనా పోరాడటానికి సిద్దంగా ఉంటాను అని గొప్పగా మాట్లాడారు. కానీ ప్రభుత్వ ఉద్యోగి మీద ఎమ్మెల్యే దాడి చేస్తే మాత్రం కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అశోక్ బాబు ఉద్యోగ సంఘాల నేతలాగా కాకుండా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మారిపోయారని అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం మాట్లాడటం లేదని కొంత మంది విమర్శిస్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాల ఎన్నికల సమయంలో బీరాలు పలికిన వాళ్లు ఇప్పుడు ఇలా ప్రభుత్వాలకు వత్తాసు పలకడం ఏంటీ అని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhu  Vanajakshi  Ashok Babu  Chintamaneni Prabhakar  Sand Mafia  

Other Articles