Beer Petrol | newzealand | North islands | Beer | Betraolium

Bikes will run with betraolium insted of petrol

Beer Petrol, newzealand, North islands, Beer, Betraolium

Bikes will run with betraolium insted of petrol. In Newzeland a company discover petorl from the beer. In North islands of newzeland selling betrolium in near 60 bunks.

ఇక బీర్ పోస్తే బైకులు నడుస్తాయ్

Posted: 07/09/2015 10:59 AM IST
Bikes will run with betraolium insted of petrol

మంచి నీళ్లు దొరకని ఊరు ఉంటుందేమో కానీ మందు దొరకని ఊరు ఉంటుందా..? అవును నిజం. ప్రభుత్వాలు చేస్తున్న పుణ్యమా అని మందు ఏరులై పారుతోంది. సరే మందు గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా..? ఇక మీదట బైకులలో బీరులు పోసి నడిపే రోజులు రానున్నాయి. దాంతో బీర్ బాటిళ్లు తాగాలనుకునే వారికి ముందుంది ముసళ్ల పండుగ. ఏంటీ బీరు పోస్తే బైకులు నడుస్తాయా అనుకుంటున్నారా..? బేషూగ్గా నడుస్తాయి. నడవడం కాదు పరిగెడతాయి. అయితే మనుషులు తాగి ఊగినట్లు కాకుండా కరెక్ట్ గా స్టడీగా నడుస్తాయి. అవును ఇక మీదట పెట్రోల్ కాదు బీట్రోలియంతోబైకులు నడుస్తాయి.


ప్రపంచంలో తొలిసారిగా ఓ కంపెనీ బీరుతో పెట్రోల్ తయారుచేసింది.  న్యూజిలాండ్‌లోని కింగ్స్ ఐలాండ్‌లో ఉన్న పెట్రోల్‌ బంకుల్లో రెండు రకాల పెట్రోల్ అమ్ముతారు.ఒకటి మామూలు పెట్రోల్‌,రెండోవది బీర్‌తో తయారుచేసింది. ప్రపంచంలో తొలిసారిగా 'డీబీ ఎక్స్‌పోర్ట్' బీర్‌తో  పెట్రోల్‌ను తయారుచేశారు.దీన్నే బీట్రోలియం అని పిలుస్తున్నారు. ఉత్తర ఐలాండ్స్‌లోని 60 పెట్రోల్ బంక్‌ల్లో బీట్రోలియం అమ్ముతున్నారు.

పెట్రోల్ కొరతతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు ఇది శుభ వార్తే. ఎందుకంటే గోల్డెన్ బీర్ తయారు చేసిన మిగిలే వ్యర్థ పదార్థమైన ఈస్ట్‌ నుంచి బయో ఫ్యూయల్ తయారుచేస్తున్నారు.దీనివల్ల పర్యావరణానికి కొంత మేలు జరుగుతోంది. పెట్రోల్‌ వల్ల గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది. బీట్రోలియం వల్ల పర్యావరణానికి హాని ఉండదంటున్నారు తయారీదారులు. అయితే ఎండా కాలంలో చల్లగా బీర్ తాగాలనుకున్న వారికి మాత్రం మాకు బీర్ల కొరత ఏర్పడుతుందా ఏంటీ అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇంకో బీర్ ఎక్కువ కొట్టేస్తున్నారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beer Petrol  newzealand  North islands  Beer  Betraolium  

Other Articles