telangana maalala jac demands to remove some scenes from baahubali movie | Baahubali Controversies

Telangana maalala jac demands to remove some scenes from baahubali movie

baahubali movie, baahubali controversy, baahubali maalala cast, baahubali release news, baahubali review, baahubali updates, rajamouli news, prabhas news, telanana maalala jac, maalala cast, maalala cast organization, telangana government, baahubali release controversy, baahubali another controversy

telangana maalala jac demands to remove some scenes from baahubali movie : telangana maalala jac demands to remove some scenes from baahubali movie which are looking abuse for their cast. Jac Chairman deepak kumar said that they already filed complaint on this movie.

‘బాహుబలి’లో ఆ సీన్లు తొలగించాలని డిమాండ్!

Posted: 07/08/2015 10:16 AM IST
Telangana maalala jac demands to remove some scenes from baahubali movie

తెలుగుచిత్ర పరిశ్రమ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా గర్వించేలా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘బాహుబలి’ చిత్రాన్ని రూపొందించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్టుతో రెండున్నరేళ్లు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి జూలై 10వ తేదీన భారీయెత్తున విడుదల అవుతోంది. ట్రైలర్ల ద్వారా అద్బుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం విడుదలకోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకజనాలు ఎంతో ఆసక్తిగా వున్నారు. ఇటువంటి ఉత్కంఠ సమయంలో ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ కులానికి చెందిన సంఘం.. ఈ సినిమా విడుదలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని తొలగించాలని డిమాండ్ చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి ఎంతో అద్భుతంగా చెక్కిన శిల్పం ‘బాహుబలి’లో మాల కులస్తును అవమానపరిచే సన్నివేశాలు, మాటలు వున్నాయని తెలంగాణ మాలల జేఏసీ మండిపడుతోంది. అందుకే.. ఆయా సన్నివేశాల్ని వెంటనే తొలగించాలని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది. యూట్యూబ్ లో మాలలను కించపరుస్తూ వున్న క్లిప్పింగ్స్ సేకరించి.. వాటిని పోలీసులకు అందించామని, ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశామని ఆ సంఘం ఛైర్మన్ బి.దీపక్ కుమార్ వివరించారు. ఆ దృశ్యాల్ని తొలగించకుంటే సినిమా విడుదలకు అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని, తమకు న్యాయం జరిగేలా సహకరించాలని ఆయన కోరారు.

ఇదిలావుండగా.. జూలై 10వ తేదీన ‘బాహుబలి’ చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే! ఈ సినిమా విడుదలకు ముందు మాలల జేఏసీ సరికొత్త వివాదంతో తెరముందుకు రావడంతో కాస్త సందిగ్ధత నెలకొంది. మరి.. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో..? ‘బాహుబలి’ యూనిట్ ఎటువంటి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baahubali movie  telangana maalala jac  rajamouli  telangana govt  

Other Articles