Oommen Chandy , Kerala, Dogs, All party meeting,

Oomen chandy informed the state ssembly that the all party meeting will discuss the stray dog menace

Oommen Chandy , Kerala, Dogs, All party meeting,

Oomen Chandy informed the state ssembly that the all-party meeting will discuss the stray dog menace Kerala's stray dogs menace has assumed such proportions that Chief Minister Oommen Chandy has called an all-party meeting to tackle the issue. Chandy on Tuesday informed the state ssembly that the all-party meeting will discuss the stray dog menace in the state, and a decision on the issue would be arrived at on Thursday

కుక్కల కోసం అఖిలపక్ష సమావేశం..!

Posted: 07/07/2015 04:47 PM IST
Oomen chandy informed the state ssembly that the all party meeting will discuss the stray dog menace

ఎక్కడైనా ప్రభుత్వాలు అఖిల పక్షాన్ని నిర్వహిస్తున్నాయి అంటే అది ఎంతో ముఖ్యమైన వ్యవహారం అయి ఉంటుంది. ప్రజలకు సంబందించిన ఏదో ముఖ్యమైన వ్యవహారం మీద చర్చించడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తాయి. ఇలా అఖిలపక్ష సమావేశంలో చర్చించి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను తీసుకుంటారు. అయితే తాజాగా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది అఖిలపక్ష సమావేవాన్ని నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగా అన్ని రాజకీయ పార్టీలను ఎల్లుండి అఖిలపక్ష సమావేశానికి రావాలని పిలుపునిచ్చారు. అయితే దీనిలో ఏమంత విషయం ఉంది అనుకుంటున్నారా..? ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యం ఎందుకో తెలుసా..? కుక్కల గురించి. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. కుక్కల గురించే అఖిలపక్ష సమావేశం.

 గతేడాది దాదాపు 90 వేల మంది కేరళవ్యాప్తంగా కుక్క కాటుబారిన పడ్డారని సమాచారం. కేరళ రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న కుక్క ల బెడద మీద అఖిలపక్షాన్ని నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోవడానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ గురువారం అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న కుక్కల బెడదను నివారించాలని వాటిని చంపేద్దామా అంటే జంతు ప్రేమికులు అస్సలు ఒప్పుకోరు. అందుకే అఖిలపక్ష సమావేశంలో కుక్కల బెడద మీద ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని, ప్రజలు కుక్క కాటుకు గురి కాకుండా చూడాలని భావిస్తున్నారు. అయితే ఇలా కుక్కల వ్యవహారం మీద ఓ రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం కావడం బహూశా ఇదే మొదటిది కావచ్చు. ఏదిఏమైనా మొత్తానికి  కుక్కలు భలే పని కల్పించాయి.

By Avhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oommen Chandy  Kerala  Dogs  All party meeting  

Other Articles