TANA | NATS | America | Telugu People | Losangels | Balakrishna | Venkiah naidu

Tana and nats mahasabhas end grandly in america

TANA, NATS, America, Telugu People, Losangels, Balakrishna, Venkiah naidu

TANA and NATS Mahasabhas end grandly in America. Telugu assosiations TANA and NATA celebrates the Mahasabhas in America. Venkiah Naidu, Balakrishna And some more political and cine stars participated in this celebrations.

ఘనంగా ముగిసిన తానా, నాట్స్ మహాసభలు

Posted: 07/06/2015 08:46 AM IST
Tana and nats mahasabhas end grandly in america

అమెరికాలో తెలుగు వారి ఘన కీర్తి ఆకాశాన్నంటింది. నింగి, నేల మురిసేలా.. తెలుగు జాతి గర్వపడేలా ప్రవాస తెలుగు సంఘాలు అమెరికాలో నిర్వహించిన సభలు అట్టహాసంగా ముగిసాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, తానాలు అమెరికాలో తెలుగు వారిని సత్కరించుకొని, మరోసారి తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహించారు. సినీ, రాజకీయ, వ్యాపార, కళా ప్రముఖలెందరో ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

Also Read :  అమెరికాలో తెలుగు వారి సంబరాలు

నాట్స్ లాస్ ఏంజిల్స్ లో చేసిన సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి అమెరికాలోని తెలుగు జాతికి దిశానిర్దేశం చేశారు. అమెరికా,భారత్‌లో నాట్స్‌ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అమెరికాలోని తెలుగు జాతికి అండగా నిలుస్తున్న నాట్స్‌ను అభినందించారు. వారికి తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎంఆర్‌ సంస్థల ఛైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ తెలుగు యువత శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను జన్మభూమి కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ అన్నారు. స్వదేశంలో సరికొత్త వ్యాపారాలు చేసేందుకు ముందుకొచ్చే వారికి తాను కూడా ఆర్ధిక మద్దతు అందిస్తానని

Also Read: నాట్స్ ఆధ్వర్యంలో ఘనంగా పి.వి జయంతి వేడుకలు

 మూడ్రోజుల పాటు అలరించిన తానా మహాసభలు ఘనంగా ముగిశాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, పత్రిక, విద్య, వైద్య రంగానికి చెందిన ప్రముఖలు ఈ సభలకు హాజరయ్యారు. చివరి రోజున తానా కొత్త కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా జంపాల చౌదరి ఎన్నికైనట్లు ప్రసుత్త అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని ప్రకటించారు. ఈ సందర్భంగా మోహన్‌ నన్నపనేని దంపతులను నూతన వర్గం సన్మానించింది. భవిష్యత్‌లోనూ తానా సభలను మరింత ఉత్సాహంగా నిర్వహిస్తామని కొత్త కార్యవర్గం హామీ ఇచ్చింది.

Also Read:  తానా అధ్యక్షుడి గా సతీష్ వేమన.. విజేతలు వీరే

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TANA  NATS  America  Telugu People  Losangels  Balakrishna  Venkiah naidu  

Other Articles