T tdp mla Revanth Reddy Latest Flexis in Hyderabad city Creates sensation | tdp party

Revanth reddy latest flexis in hyderabad city creates sensation

revanth reddy hordings, revanth reddy flixs, revanth reddy news, revanth reddy updates, revanth reddy controversy, vote for cash, phone tapping

Revanth Reddy Latest Flexis in Hyderabad city Creates sensation : T tdp mla Revanth reddy fans creates interesting flexis on him for releasing from jail.

రేవంత్ విడుదల.. ‘ఆట మొదలైంది’

Posted: 07/01/2015 10:21 AM IST
Revanth reddy latest flexis in hyderabad city creates sensation

‘ఓటుకు నోటు’ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టీ-టీడీపీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అభిమానులు సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయన విడుదల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.

అయితే.. వీటిల్లో కొన్ని ఫ్లెక్సీలు చాలా ఆసక్తిరంగా వున్నాయి. ఆ ప్లెక్సీల్లో రాసిన వ్యాఖ్యలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటే ‘ఆట మొదలైంది’ ఫ్లెక్సీ. ఎన్టీఆర్, చంద్రబాబులతోపాటు ఓ పెద్దపులి బొమ్మ, రేవంత్ రెడ్డి చిత్రం వున్న ఈ ఫ్లెక్సీపై ‘ఆట మొదలైంది’ అని రాశారు. ఇది నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దర్శనం ఇస్తోంది. ఆ విధంగా వారు ఆ ఫ్లెక్సీ పెట్టడాన్ని చూస్తుంటే.. స్వతహాగా తెలంగాణ అధికార పార్టీ వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. విడుదల అయిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం నేరుగా రేవంత్ రె‘డ్ఢీ’ కొనడం ఖాయమన్న ఉద్దేశంతో ఆ విధంగా హోర్డింగులు పెట్టినట్లు తెలుస్తోంది.

నిజానికి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నోసార్లు టీఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యాలతో టీఆర్ఎస్ నేతల్ని మాటలతూటాలు పేల్చారు. ఇప్పుడు జైలు నుంచి విడుదలై వస్తున్న రేవంత్.. ఇకపై సమస్యలను పరిష్కరించే దిశగా మరింతగా స్పందిస్తారని వారి భావన! ‘ఓటుకు నోటు’ కేసులో తెలివిగా వ్యవహరించిన తనను ఇరికించి, చేసిన అన్యాయానికి ఎదురునిలిచి పోరాడతారని చెప్పేందుకు ఈ ఫ్లెక్సీలు ముద్రించినట్లు రేవంత్ అభిమానులు అంటున్నారు. మరి.. ఈ ఫెక్సీలపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : revanth reddy  vote for cash  phone tapping  revanth flexis  

Other Articles