DS | D Srinivas | Nizamabad | Congress | TRS | KCR | KTR

Telangana congress party senor leader d srinivas likely to join into the trs party soon

DS, D Srinivas, Nizamabad, Congress, TRS, KCR, KTR

Telangana congress party senor leader D srinivas likely to join into the TRS party soon. DS very anger on congress party and wants to join the TRS party.

డిఎస్ కాంగ్రెస్ కు చెయ్యిచ్చి కారెక్కుతారా..?

Posted: 07/01/2015 07:55 AM IST
Telangana congress party senor leader d srinivas likely to join into the trs party soon

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో పెద్దతలకాయ గుడ్ బై చెప్పనుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు డిఎస్ ఇక మీద హస్తం వదిలి  కారు ఎక్కునున్నారని దాదాపు ఖరారైంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే చాలా మంది చేయిచ్చి వెళ్లిపోగా.. తాజాగా మరో కీలక నేత కూడా పార్టీ మారనుండటంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే తగలనుంది. అయితే ఇదే విషయంపై కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా ఎంతో మంది పార్టీ లోకి వస్తుంటారు పోతుంటారు..కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది అంటూ పాత డైలాగులే వల్లెవేస్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ లో కాంగ్రెస్ క్యాడర్లో  కీలకంగా వ్యవహరిస్తున్న వారందరూ కూడా గులాబి కండువా కప్పుకోనున్నారు. అయితే పార్టీలో తన ఎదురుగలకు అడ్డుకుంటున్నారని, పార్టీలో గత కొంత కాలంగా తనకు జరుగుతున్న అవమానం భరించలేక పార్టీ మారుతున్నట్లు డిఎస్ తన వారితో అంటున్నట్లు సమాచారం.

తెలంగాణలో వలసలను ప్రోత్సహించడంలో ముందున్న టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిఎస్ రాకను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిఎస్ చేరిక మొత్తాన్ని కేసీఆర్ కొడుకు కేటీఆర్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారని... త్వరలోనే తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరిపోతారని తెలుస్తోంది. ఇటీవల తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై డీఎస్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియాకు నెల క్రితమే లేఖ రాసినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా... పార్టీ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై ఆయన ఆక్రోశం వెళ్లగక్కినట్లు తెలిసింది.జూలై 3 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లా పర్యటన సందర్భంగా డీఎస్‌ మెడలో గులాబీ కండువా వేస్తారని సమాచారం. కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లా పర్యటన జూలై 6న ఉండవచ్చని అంటున్నారు. అప్పుడు కాకపోయినప్పటికీ... కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లాలో ఎప్పుడు పర్యటిస్తే అప్పుడు టీఆర్‌ఎస్‌లో డీఎస్‌ చేరిక పక్కా అని వారు చెబుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DS  D Srinivas  Nizamabad  Congress  TRS  KCR  KTR  

Other Articles