aeroplanes can fly on from holy seven hills of tirumala

Kutralam peetadhipathi sri siddheswarananda bharathi swamiji sensational comments on tirumala

Kutralam Peetam, Kutralam Peetadhipathi Sri Siddheswarananda Bharathi Swamiji, Siddheswara Bharathi sensational comments on tirumala, helicopter, helipad, ropeway, tirumala,

Kutralam Peetadhipathi Sri Siddheswarananda Bharathi Swamiji sensational comments on tirumala, says aeroplanes can fly on from holy seven hills of tirumala

కలియుగ వైకుంఠంపై సిద్దేశ్వర భారతి సంచలన వ్యాఖ్యలు

Posted: 06/28/2015 03:39 PM IST
Kutralam peetadhipathi sri siddheswarananda bharathi swamiji sensational comments on tirumala

కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర భారతిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల క్షేత్రం మీదుగా గగనతలంలో విమానాలు వెళ్లరాదన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను ఆయన తోసిపుచ్చుతూ.. తిరుమల కోండ మీదుగా విమానాలు వెళ్లవచ్చనన్నారు. అయితే శ్రీవారి గర్భాలయంపై నుంచి మాత్రమే విమానాలు వెళ్లరాదని కీటుకు విధించారు. అయితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి.. భూతల వైకుంఠంగా పేరుగాంచిన పుణ్యక్షేత్రంలో నిత్యం లక్షలాధి మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల చేత తిరుమల తిరుపతి అధికారుల అభ్యర్థన మేరకు ఈ నిబంధన విధించిన విషయం తెలిసిందే.

కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర భారతి ఇవాళ తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద సిద్ధేశ్వర భారతికి అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల గిరిపై భక్తుల సౌకర్యార్థం రోప్‌వే, హెలిప్యాడ్‌ కూడా నిర్మించవచ్చని అన్నారు. ఇక స్వామివారి నామాల అంశాన్ని వివాదాస్పద చేయడం సరికాదన్న కుర్తాళం పీఠాధిపతి, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా శ్రీవారికి రోజూ గంట విరామం ఇవ్వాలని స్పష్టం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kutralam Peetam  Siddheswara Bharathi  sensational comments  tirumala  

Other Articles