MP couple commits suicide after their intimate video being circulated online

Young couple commits suicide after they find their intimate video being circulated online

couple commits suicide after they find their intimate video being circulated online, Dewas couple, jail, Last rites, mobile phone, intimate video, circulated online, shocked and feeling ashamed, committed suicide, suicide, poisonous substance

Ashamed after learning that a video clipping of them in intimate position was circulated on social media, young Dewas couple, shocked and feeling ashamed, committed suicide by consuming poisonous substance

సోషల్ మీడియా, ఆ పోకిరీలు నవదంపతులు ఉసురు తీశారు..

Posted: 06/27/2015 10:35 PM IST
Young couple commits suicide after they find their intimate video being circulated online

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒక యువజంట.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాకు చెందిన దంపతులు రాజేంద్ర జాట్ (38), రచనా జాట్ (32)లు అవమాన భారంతో విషగులిళలు సేవించి ప్రాణాలు విడిచారు. కొందరు పోకిరీలు చేసిన పనితో.. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి తోడు సెల్ ఫోన్ లలో బ్యాంకు, ఇతర ముఖ్యమైన విషయాలకు సంబంధిచిన వ్యక్తిగత వివరాలను నిక్షిప్తపర్చవద్దన్న సూచనలు పాటించకపోవడం కూడా యువ జంటను ఆత్మహత్య దిశగా ప్రోత్సహించాయి. తమ సంభోగ దృశ్యాలను రికార్డు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..

మధ్య ప్రదేశ్ లోని నూతనంగా వివాహం చేసుకున్న యువజంట.. రాజేంద్ర జాట్, రచనా జాట్ నెల రోజుల కిందట ప్రయాణంలో తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఫోన్ దొంగలించిన నలుగురు యువకులను ఈ నెల 18న పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారిని కోర్టులోనూ హజరుపర్చి జైలుకు తరలించారు. అయితే వారు అరెస్టు అయిన తరువాత అసలు విషయం యువ జంటకు ఆలస్యంగా తెలిసింది. దీంతో వారు విషపధార్థాలను సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఫోన్ దొంగలించిన నలుగరుగు యువకులు అందులోని మొమరీ కార్డులో వున్న వీడియో క్లిప్పింగ్ను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడాన్ని గమనించిన బంధుమిత్రులు వారికి పోన్ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో వారు చాలా అవమానంగా ఫీలయ్యారు. సమాజంలో తమ పరువు పోయిందని భావించి, ఇక బతకడం అనవసరమని భావింిచన వారు విష గుళికలను సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పోలీసుల నుంచి అందుకున్న కుటుంబ సభ్యులకు వారికి దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో దేవాస్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dewas couple  jail  Last rites  MP couple  suicide  

Other Articles