electronic media persons arrested in vishakapatnam

Media persons arrested in visakha

media persons arrested in visakha, electronic media persons, vishakapatnam, bribe, smuggling, ganga, charas, buchayyapeta, vaddadhi, odisha numbered car, checking, unofficial checks

electronic media persons arrested in vishakapatnam as they demanded bribe from police officials, thinking they are smugglers

స్మగర్ల కోసం మాటు వేస్తే పోలీసులు వచ్చారు.. పాపం పాత్రికేయులు

Posted: 06/27/2015 02:05 PM IST
Media persons arrested in visakha

డామిడ్ కథ అడ్డం తిరిగింది.. అన్న నానుడి మనం తరుచూ వింటూనే వుంటాం. అయితే కొందరు పెద్దలు మాత్రం తానోకటి తలిస్తే.. దైవం ఒకటి తలచిందని వేదాంత దోరణిలో చెబుతుంటారు. ఏది ఏమైనా.. విశాఖపట్నం జిల్లాలోని బుచ్చయ్యపేట మండలానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మాత్రం నిజంగానే విధి వంచన అంటే ఏమిటో అర్థమైయ్యింది. కొందరు రిపోర్టర్లు స్మగర్ల కోసం మాటు వేస్తే.. పోలీసులు వచ్చారు. దీంతో వారు అడ్డంగా బుక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నడుస్తున్న గంజాయి స్మగర్లు.. లక్షాలాధి రూపాయలను ఆర్జిస్తున్నారని సమాచారం అందుకున్న విలేకరులు.. వారి బెదిరించి.. నయానో, భయానో వారి నుంచి డబ్బు రాబట్టాలని పథకం వేశారు. పథకంలో భాగంగా బుచ్చయ్యపేటలోని వడ్డాది వద్ద మాటు వేశారు.

ఇంతలో ఒడిశా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కలిగి ఉన్న ఒక కారు అటుగా వచ్చింది. అది గంజాయి అక్రమ రవాణా వాహనమేనని భావించిన విలేకరులు.. కర్రలతో రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆ వాహనాన్ని నిలిపివేశారు. కారును తనిఖీ చేయాలని లోపలున్నవారిని గద్దించారు. అక్కడే వారి కథ అడ్డం తిరిగింది. వారు అనుకున్నట్టు లోపల ఉంది గంజాయి స్మగ్లర్లు కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్పెషల్‌ పార్టీ పోలీసులు. సీఐ కె.సూర్యనారాయణ కూడా కారులోనే ఉన్నారు. విలేకరుల హడావుడిని గమనించిన ఆయన.. తనిఖీ చేయడానికి మీరెవరంటూ వారిని ‘గట్టిగా’ నిలదీశారు.

గంజాయి రవాణా చేస్తున్న వాహనం వస్తోందని సమాచారం రావడంతో కాపు కాశామని విలేకరులు ఆయనకు చెప్పారు. వాహనాన్ని అడ్డుకునేందుకు కర్రలు దేనికంటూ... ఆయన ప్రశ్నించారు. అయితే అయన కారు దిగి ఇద్దరు విలేకరులనూ పట్టుకుని బుచ్చెయ్యపేట పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ క్రమంలో అక్కడే వున్న మరికోందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఘటనా స్థలం నుంచి పరారై.. తప్పించుకున్నారని సమాచారం. రెడ్ హ్యాండెడ్ గా దోరికిన ఇద్దరు విలేకరులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై సీఆర్‌పీసీ 170, 353, 341, 342, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : media persons  arrest  special party police  vishakapatnam  

Other Articles