section 8 | Hyderabad | ap | telangana | Bifercation | TDP

Ap govt palns to campain about the section 8 in hyderabad

section 8, Hyderabad, ap, telangana, Bifercation, TDP

ap govt palns to campain about the section 8 in Hyderabad. ap ministers and some tdp persons encourage the campaign about the section 8.

సెక్షన్ 8 మీద ఇక ఉద్యమం

Posted: 06/27/2015 10:58 AM IST
Ap govt palns to campain about the section 8 in hyderabad

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సీమాంధ్రుల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణలేదని కాబట్టి హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చెయ్యాల్సిందేనని ఏపి ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే విభజన చట్టంలోని సెక్షన్ 8 ని అమలు చెయ్యడానికి అభ్యంతరం ఏంటి అని కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అయితే ఏపిలో సెక్షన్ 8 పై ప్రజల్లో అవగాహన కల్పించి ఉద్యామానికి సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులొ భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పలు జిల్లాల్లో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు వ్యవమారాన్ని పక్కకు పెట్టి కేవలం హైదరాబాద్ లో సెక్షన్ 8 మీద మాత్రమే మొబులైజ్ చెయ్యాలని చూస్తున్నారు. ఈమేరకు మంత్రులు కూడా ఏపిలో రకరకాల వ్యాఖ్యలు చేస్తూ కాకను మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రుల అచ్చెన్నాయుడు, రావెలలు ఏపిలోని ముఖ్య నాయకులతో ఈ మేరకు చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ లోని సీమాంధ్రుల రక్షణ కోసం ఉద్యమించకపోతే తెలంగాణ ప్రభుత్వం మరింత రెచ్చిపోతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కూడా వాదిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కిందని, ఏపి ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని ఏపి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఏపి నేతలు. మొత్తానికి గత వారం రోజులుగా సెక్షన్ 8 అమలును కోరుతూ పాగుతున్న నిరసన కార్యక్రమాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నా మాట మాత్రం వాస్తవమే. కాగా విభజన సమయంలో ఉద్యమ బాట పట్టిన సీమాంధ్ర ప్రజలు మరోసారి సెక్షన్ 8 మీద అదే బాటలో నడుస్తారా లేదా చూడాలి.ౌ

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : section 8  Hyderabad  ap  telangana  Bifercation  TDP  

Other Articles