floods | uttarakhand | telugu people | charudham | bhadrinath

Major floods effected the uttarakhand

floods, uttarakhand, telugu people, charudham, bhadrinath

Floods Even before the Telugu people could forget the deadly flash floods in Uttarakhand in 2013 in which several Telugu people lost their lives, yet another flash flood in Uttarakhand has hit a group of 140 pilgrims from Ananthapur district. Ever since the floods erupted, they have been taking shelter in an inn and cut off from outside communication

ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం

Posted: 06/27/2015 08:38 AM IST
Major floods effected the uttarakhand

ఉత్తరాఖండ్‌ లో వరదలు  భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎక్కువగా కొండలు, గుట్టలతో నిండినది కావడంతో వరద భీభత్సానికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దాంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతికి వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో ఛార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. కేదార్‌ లోయ, హేమకుండ్‌ సాహిబ్‌, బద్రీనాథ్‌ ప్రాంతంలో చిక్కుకున్న సుమారు 900 మందిని సైన్యం హెలికాప్టర్‌ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రుద్రప్రయాగ, ఛమోలీ జిల్లాలోని చాలా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. సోన్‌ ప్రయాగ, గౌరీకుండ్‌ మధ్య ఉన్న భారీ రహదారి వంతెన వరదలకు కొట్టుకుపోయింది. కేదారినాథ్‌, బద్రీనాథ్‌ సమీప ప్రాంతాలకు చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేదారినాథ్‌ వద్ద యాత్రికులెవరూ లేరని.. అందరినీ సోన్‌ప్రయాగకు తరలించామన్నారు. బద్రీనాథ్‌, హేమకుండ్‌ సాహిబ్‌లో చిక్కుకున్న యాత్రికులను జోషిమఠ్‌, గంగారియాకు చేరవేసినట్లు తెలిపారు.

బద్రినాథ్, హేమకుండ్లకు వెళుతూ కొంత మంది, స్థానికంగా ఉంటున్న వారు మొత్తంగా ఈ ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వేల మంది చిక్కుకున్నట్లు చమోలీ జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. అయితే పరిస్థితి కంట్రోల్ లోనే ఉందని, ఆందోలన చెందాల్సిన పని లేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన అనంతపురం జిల్లావాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. సుమారు 150మంది భక్తులు వివిధచోట్ల సత్రాల్లో తలదాచుకున్నట్టు సమాచారం. యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారన్న సమాచారంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఈనెల 18న కెకె ఎక్స్‌ప్రెస్‌లో హిందూపురం, మడకశిర, కదిరి, తనకల్లు, బెళగుప్ప, కర్నాటకలోని బళ్ళారి, పావగడ, వైఎస్‌కోట ప్రాంతాల్లోని సమీప బంధువులంతా కలిసి ఉత్తరాఖండ్‌లోని వివిధ పుణ్యక్షేత్రాల సందర్శనకు ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బద్రీనాథ్ వెళ్లాల్సివుండగా వాతావరణం అనుకూలించక రైళ్లలో చేరుకున్నారు. బద్రీనాథ్‌లో చండీహోమం నిర్వహించేందుకు వీరంతా వెళ్లారు. బద్రీనాథ్‌లో పూజల అనంతరం వీరంతా కేథార్‌నాథ్, ఇతర పుణ్యక్షేత్రాలు సందర్శించాల్సి ఉంది. కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో రోడ్డు మార్గాలు ఛిద్రం కావడంతో వివిధ ఆశ్రమాల్లో వీరంతా తలదాచుకున్నట్లు తెలుస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : floods  uttarakhand  telugu people  charudham  bhadrinath  

Other Articles