Undavelli Arun kumar | Ap | Supreme court | Bifercation

Undavali arun kumar sensational statements on bifercation of ap

Undavelli Arun kumar, Ap, Supreme court, Bifercation, Chandrababu naidu

Undavali arun kumar sensational statements on bifercation of ap. He said that may supreme court may will give sensational judgement on the ap bifercation.

విభజన చట్టంపై చారిత్రాత్మక తీర్పు వస్తుందా..?

Posted: 06/27/2015 08:00 AM IST
Undavali arun kumar sensational statements on bifercation of ap

తెలుగు రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించింది ఎన్డీయే ప్రభుత్వం. అయితే పార్లమెంట్‌లో విభజన బిల్లు పాస్‌ కాలేదని, మెజార్టీ లేకపోయినా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశానని, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలతో కోర్టులో వాదిస్తానని చెప్పారు. విభజన బిల్లుపై సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన మంచి తీర్పు ఇస్తుంది బాంబ్ పేల్చారు. లోక్‌సభలో మెజారిటీ లేకపోయినా విభజన బిల్లు పెట్టారని, విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినా దానిని పరిశీలించలేదని చెప్పారు. తాను యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టానని, దీంతో తనను సస్పెండ్‌ చేశారని తెలిపారు. పార్లమెంట్‌లో తనను మాట్లాడనీయలేదన్నారు. దీనిపై కూడా కోర్టులో సవాల్‌ చేస్తున్నానని చెప్పారు. రేవంత్‌రెడ్డి వ్యవహారం ఏపీకి సంబంధించిన అంశం కాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రెండు రాష్ట్రాల టీడీపీ అధ్యక్షుడు గనుక ఆయన వరకే ఇది పరిమితమని చెప్పారు. ఏపీ ప్రజలపై దీని ప్రభావం ఉండదన్నారు.

సెక్షన్ 8, షెడ్యూల్ 10లను అమలు చేయాలంటూ టీడీపీ, ఏపీ సీఎం అడగాల్సిన అవసరం లేదని, ఆ సెక్షన్లు కచ్చితంగా అమలు కావాల్సిందేనని  ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని అంబేద్కర్‌ ఆనాడే చెప్పారని, ఇప్పటికైనా మించిపోయింది లేదన్నారు. హైదరాబాద్‌ను యునియన్ టెరిటరిగా చేయడంవల్ల పన్నులు ఉండవని, గవర్నర్‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉంటారని చెప్పారు. చంద్రబాబే కాదు, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణనైనా ట్యాపింగ్‌ చేయడం చట్టవిరుద్ధం, నేర పూరితం అని అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ట్యాపింగ్‌ చేసినట్టు రుజువైతే కేసీఆర్‌కు పదవీ గండం తప్పదని చెప్పారు. చంద్రబాబు ఫోన్‌ వాయిస్‌గా విడుదలయిన టేప్‌లో ఏమీలేదని, అది కోర్టులో కూడా నిలబడదని అన్నారు. చంద్రబాబు మాట్లాడినట్టుగా చెబుతున్న దానిలో తప్పేమీ లేదని, ఆ మాటల్లో నేర పూరితం ఏమీలేదని చెప్పారు. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించకపోవడం విశేషం వ్యాఖ్యానించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Undavelli Arun kumar  Ap  Supreme court  Bifercation  Chandrababu naidu  

Other Articles