telangana | schedule ten | advocate general | institutions

Telangana state govt conformed that the institutions in the tenth schedule belongs to telangana

telangana, schedule ten, advocate general, institutions, Take Over Tenth Schedule Institutions, Telangana Chief Secretary, hyderabad Industries

Telangana state govt conformed that the institutions in the tenth schedule belongs to telangana. Telangana advocate general clarify that 97 institutions which described in the schedule ten belongs to telangana.

షెడ్యూల్ పదిలోని అన్ని సంస్థలు తెలంగాణవే

Posted: 06/26/2015 08:35 AM IST
Telangana state govt conformed that the institutions in the tenth schedule belongs to telangana

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి తెర తీసిన షెడ్యూల్ పది మీద తెలంగాణ సర్కార్ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఏపి ప్రభుత్వం వాదిస్తున్నట్లు షెడ్యూల్ పదిలోని సంస్థలపై తమకూ హక్కు ఉంటుందంటూ.. కొత్తగా శాఖాథిపడుతులను నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వివాదానికి తెర తీసింది. అయితే తెలంగాణ అడ్వకేట్ జనరల్ షెడ్యూల్ పదిపై క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ 10లో ఉన్న 97 సంస్థల నిర్వహణ, ఆస్తులు, నిధుల యాజమాన్యం, అధికారుల నియామకాల బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ అంతగా కావాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని, యూజర్ చార్జీలు చెల్లిస్తేనే ఆ సంస్థలనుంచి సేవలు అందించాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో వివాదం సృష్టిద్దామని ఆధిపత్య ధోరణితో ఏపీ తీసుకున్న నిర్ణయం చివరికి బెడిసికొట్టింది.

తెలంగాణ ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సలహాలు
* 10 వషెడ్యూల్‌లో పేర్కొన్నవిధంగా తెలంగాణ రాష్ట్ర భూభాగంలోని సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయి. ఇందులో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు.
* ఏపీ ప్రభుత్వం ఈ సంస్థల సేవలను వినియోగించుకోవాలంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే సేవలకు యూజర్ చార్జీలు చెల్లిస్తేనే ఆయా సేవలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. డబ్బులు చెల్లించకపోతే సేవలు అందించేది లేదు.
* 10వ షెడ్యూల్‌కు చెందిన పలుసంస్థల్లో ఇప్పటి వరకు రూ.100 కోట్లను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకున్నది. ఆంధ్రాకు వెళ్లిన ఈ సొమ్మును వెంటనే తిరిగి వెనక్కు తీసుకురావాలి. ఉన్న నిధులను ఆంధ్రాకు తరలిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంస్థలకు చెందిన నిధులపై ఏపీకి ఎలాంటి అధికారం లేదు.
* 10వ షెడ్యూల్ సంస్థలపై ఏపీకి అధికారం ఉందని ఇచ్చిన జీవో చెల్లదు. ఏపీకి ఈ సంస్థల్లో ఎలాంటి అధికారం లేదు.
* బ్యాంకు అకౌంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంస్థలపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. ఈ విషయాన్ని కోర్టుకూడా స్పష్టం చేసిందని బ్యాంకులకు తెలియజేయాలి. బ్యాంకుల్లో ఉన్న ఆయా సంస్థల డిపాజిట్లు, నిధులు, అకౌంట్లన్నీ తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేయాలి. ఈ మేరకు ఆయా అకౌంట్లన్నింట్లో తెలంగాణ ప్రభుత్వమే లావాదేవీలు నిర్వహిస్తుందని స్పష్టం చేయాలి. ఈ మేరకు తెలంగాణకు చెందిన అధికారులు చేసే సంతకాలు మాత్రమే చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మీద ఏపి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం పేచీ పెడితే కోర్టును ఆశ్రయించాలని ఏపి ప్రభుత్వం గతంలో బావించింది. అయితే తెలంగాణ సర్కార్ పదో షెడ్యూల్ లోని సంస్థలన్నింటిపై తమకే హక్కులుంటాయని తేల్చి చెప్పేసింది. మరి ఇప్పుడు ఏపి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles