Vijay Galani producer of Veer has accused Salman of causing him mental harassment and agony | Salman Khan

Veer producer threatens to sue salman khan 250 crore

salman khan, salman veer controversy, producer vijay galani, veer producer vijay galani, salman khan controversies, salman khan veer contro news, salman khan updates, salman khan cases, vijaya galani news, producer vijay galani, veer movie, salman veer movie

Veer Producer Threatens to Sue Salman Khan 250 Crore : Veer producer Vijay Galani has sent a legal notice threatening to sue Bollywood superstar Salman Khan for Rs 250 crores for mental harassment and agony.

సల్మాన్ వేధింపులు తాళలేక 250 కోట్ల దావా వేసిన నిర్మాత

Posted: 06/23/2015 06:18 PM IST
Veer producer threatens to sue salman khan 250 crore

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మంచి మనసు కలవాడని బాలీవుడ్ అభిమానులతోపాటు ప్రముఖులు సైతం పొగుడుతుంటారు. ఇప్పటికే ఇతగాడు ‘హ్యూమన్ బీయింగ్’ పేరిట పేదచిన్నారులకు వైద్య సేవలు అందించడం, వ్యాధుల బారిన పడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును భరించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. దీంతో ఇతనిని ‘మానవత్వానికి’ మారుపేరుగా బాలీవుడ్ జనాలు చెప్పుకుంటారు. కానీ.. ఇటువంటి మానవతావాదాన్ని కలిగిన సల్మాన్ ఖాన్.. ఓ నిర్మాతను మాత్రం తీవ్రంగా వేధించాడట! కోట్లాధిపతికి వారసుడైన ఈ హీరో కేవలం రూ.15 కోట్ల కోసం ఆ నిర్మాతను మానసిక వేదనకు గురిచేశాడు. అంతే! సల్మాన్ వేధింపులు తాళలేక ఆ నిర్మాత అతనిపై ఏకంగా రూ.250 కోట్ల దావా వేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతంలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘వీర్’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందింది. మంచి విజయం సాధిస్తుందనుకుని అది బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమాను నిర్మించిన నిర్మాత విజయ్ గలానీకి అది తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో అతనికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. అటువంటి పరిస్థితుల్లో వున్న తనను సల్మాన్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చెల్లించాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చి వేధించేవాడట! ఇలా గత మూడేళ్ల నుంచి సల్మాన్ తనని తీవ్రంగా వేధించాడని.. అతని వేధింపులు తాళలేక అంతులేని మానసిక ఆవేదన అనుభవించానని చెబుతున్న గిలానీ బాంబే హైకోర్టులో రూ.250 కోట్ల దావా వేశాడు. తనను వేధించి, తన పరువుకు నష్టం కలిగేలా ప్రవర్తించిన సల్మాన్ ను రూ.250 కోట్ల రూపాయలు చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

‘అదేంటి.. సినిమా నిర్మాణానికి ముందే రెమ్యునరేషన్ వ్యవహారం గురించి ఒప్పందం కుదుర్చుకుని వుంటారుగా! అప్పుడు వారి మధ్య రూ.15 కోట్ల ఒప్పందం కుదిరి వుంటుంది. ఆ డబ్బుల్నే సల్మాన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇందులో తప్పేముంది’ అని అందరిలోనూ సందేహం కలుగుతుంది. నిజమే.. సినిమా నిర్మాణానికి ముందు ఈ ఒప్పందాలు జరుగుతాయి. కానీ.. వీరి మధ్య వ్యవహారం వేరేలా వుంది. ‘వీర్’ సినిమా నిర్మాణానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సల్మాన్ మార్కెట్ ని బట్టి 7 లేదా 8 కోట్లు చెల్లించాలని.. ఒకవేళ సినిమా హిట్ అయితే రూ.15 కోట్లు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ సల్మాన్ రూ.15 చెల్లించాలంటూ ఒత్తిడి చేసేవాడని గిలానీ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ వివాదాన్ని తాను ‘నిర్మాతల మండలి’ దృష్టికి తీసుకెళ్లే.. సల్మాన్ కూడా తనపై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ అసోసియేషన్’కు ఫిర్యాదు చేశాడని గిలానీ తెలిపాడు. ఏదో ఒక విధంగా మూడేళ్ల నుంచి సల్మాన్ తనని రెమ్యునరేషన్ విషయమై వేధిస్తూ వస్తున్నాడని.. అతని వేధింపుల కారణంగా తాను అంతులేని మానసిన వేదన అనుభవించానని నిర్మాత కోర్టుకు ఆవేదన వెల్లడించాడు. ఇప్పటివరకు కోర్టు, న్యాయవాదుల ఫీజులు, ఇతర ఖర్చులు అంటూ తన దగ్గర వున్న మొత్తం ఖర్చైపోయిందని.. దీనికంతటికి కారణమైన సల్మాన్ కాబట్టి అతనిపై రూ.250 కోట్ల పరువునష్టం దావా వేస్తున్నట్లు ఆయన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. మరి.. ఈ పిటిషన్ పై సల్మాన్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  veer movie  producer vijay galani  

Other Articles