Chandrababu naidu | Yoga | sections 8 | Hyderabad | Telangana

Chandrababu naidu doing yoga with relaxed mind

Chandrababu naidu, Yoga, sections 8, Hyderabad, Telangana

Chandrababu naidu doing yoga with relaxed mind. Central govt taking steps to implement section 8 in Hyderabad.

ఇక అంతా ప్రశాంతమే అంటున్న చంద్రబాబు

Posted: 06/23/2015 03:54 PM IST
Chandrababu naidu doing yoga with relaxed mind

చంద్రబాబు నాయుడుకు ఓ మూడు వారాల నుండి టెన్షన్ లు తెగ తలనొప్పిగా మారాయి. ఓటుకు నోటు వ్యవహారంతో తీవ్ర వత్తిడికి గురైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత నుండి చంద్రబాబు చాలా హుషారుగా కనిపిస్తున్నారట. ఇంతకీ అంతలా సంతోషించే విషయం ఏంటా అనుకుంటున్నారా..? ఏపి ప్రభుత్వం వాదిస్తున్నట్లు హైదరాబాద్ లో సెక్షన్ 8 ను అమలు చెయ్యాలన్న డిమాండ్ పై వేగంగా మూవ్ మెంట్ వస్తోంది. దాంతో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చేసిన వత్తిడి బాగానే పనిచేస్తోందని, తెలంగాణ సర్కార్ కొమ్ములు విరుగుతాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే కేంద్రం కూడా సెక్షన్ 8 ను అమలు చెయ్యడానికి సిద్దంగా ఉన్నాయని దాదాపుగా తెలిసిపోయింది. దాంతో యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్నారట చంద్రబాబు నాయుడు.

ఓటుకు నోటు వ్యవహారంలో విమర్శల పాలైన చంద్రబాబు నాయుడు ట్యాపింగ్ వ్యవహారంపై, గవర్నర్ నరసింహన్ వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ స్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందని, తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయితే తెలంగాణ సర్కార్ దూకుడుకు కళ్లెం వెయ్యడానికి చంద్రబాబు నాయుడు కేంద్రానిరి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ సర్కార్ కు అన్ని బాధ్యతలు కాకుండా ఉమ్మడి రాజధాని కాబట్టి రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 ను అమలు చెయ్యాలని పట్టుబట్టారు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సెక్షన్ 8 అమలుకు దాదాపుగా లైన్ క్లీయర్ చేసినట్లు కనిపిస్తోంది. దాంతో కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేసినట్లు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  Yoga  sections 8  Hyderabad  Telangana  

Other Articles