Only 8 days remaining for currency exchange of 500 and 1000 notes which printed before 2005 | RBI

8 days remaining for currency exchange rbi new rules

currency exchange, money exchange, black money prevention, rbi rules, rbi money exchange, rbi latest updates, rbi news, rbi new schemes, black money in india, fake notes in india, currency exchange updates, 500 indian rupee notes, 1000 rupee notes

8 days remaining for currency exchange rbi new rules : Only 8 days remaining for currency exchange of 500 and 1000 notes which printed before 2005. Rbi took this action to prevent black money and fake notes.

తస్మాత్ జాగ్రత్త.. సమయం దగ్గరపడుతోంది!

Posted: 06/22/2015 03:05 PM IST
8 days remaining for currency exchange rbi new rules

భారతదేశం... విశాల సంపదకు నిలయం! కానీ.. కొందరు దోపిడీదారులు తమ స్వార్థ సౌలభ్యం కోసం కోటానుకోట్ల రూపాయలను లెక్కల్లో చూపించకుండా దాచేసుకున్నారు. సూటిగా చెప్పాలంటే.. అలా దాచుకన్న డబ్బంతా ‘బ్లాక్ మనీ’ కిందకు వస్తుందన్నమాట! అలా డబ్బులను దాచుకున్న వారిలో వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు ఎక్కువగా వున్నారు. ఈ బ్లాక్ మనీని సదరు వ్యక్తుల నుంచి బయటికి తీయించడం అసాధ్యం కాబట్టి.. ఆర్బీఐ ఓ తెలివైన నిర్ణయం తీసుకుంది. దేశంలో దాగివున్న కోటానుకోట్ల బ్లాక్ మనీని శాశ్వతంగా అరికట్టేస్తే సమస్య వుండదని ఆలోచించిన ఆర్బీఐ.. ఆమేరకు పావులు కదిపింది. ఇంతకీ ఆర్బీఐ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే.. 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లు జూన్ 30వ తేదీ నుంచి చెల్లవు.

మరి.. సాధారణ వినియోగదారుల పరిస్థితి ఎలా? అని అనుకుంటున్నారా! అందుకు పరిష్కారం కూడా ఆర్బీఐయే సూచించింది. 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లకు బ్యాంకుల్లో మార్చుకోవడానికి వీలు కల్పించింది. అయితే.. అందుకు కేవలం 8 రోజులు మాత్రమే గడువు మిగిలింది. ఇప్పటికే ఆయా నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ రెండుసార్లు గడువు పొడిగించింది. మొదట జనవరి 1 ముగిసిన ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఈ నెలాఖరులోపు తమ సమీప బ్రాంచీల్లో మార్చుకోవాలని సూచించింది. ఎవరి దగ్గరైనా అలాంటి నోట్లు వుంటే.. దేశవ్యాప్తంగా వుండే ఏ ప్రభుత్వం బ్యాంకులోనైనా సమర్పించి... దానికి సమానమైన నోట్లను పొందవచ్చునని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని.. జూన్ 30 తర్వాత సదరు నోట్లు చెల్లవని స్పష్టం చేసింది.

2005కు ముందు ముద్రించిన నోట్లను సునాయాసంగా గుర్తించవచ్చునని ఆర్బీఐ పేర్కొంది. నోటు వెనుకవైపు ముద్రించిన సంవత్సరం వుందని.. ఇక ముందు ముంద్రించే నోట్లకు కింద సంవత్సరం వుంటుందని ఆర్బీఐ తెలిపింది. కాబట్టి.. ప్రతిఒక్కరు గడువు తేదీ ముగిసేలోపు అంటే జూన్ 30లోపు తమ దగ్గరున్న నోట్లను మార్చుకోవాలని అధికారులు పదేపదే సూచిస్తున్నారు. ఏదేమైనా.. ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఈ నిబంధన వల్ల విచ్చలవిడిగా చెలామణి అవుతున్న నకిలీనోట్లు, బ్లాక్ మనీ చాలావరకు నివారించబడుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : money exchange  rbi schemes  500 rupee notes  

Other Articles