TRS party leaders frightened when their mobile calling | phone tapping controversy | Vote for note

Trs party leaders frightened when their mobile calling

trs party leaders, tdp party news, central govt, bjp party, phone tapping controversy, vote for note, trs senior leaders, chandrababu naidu, kcr

TRS party leaders frightened when their mobile calling : In the political circles the rumours going viral about trs party leaders that they are afraid when their mobile calls.

‘ఫోన్ కాలింగ్ బెల్’.. టీఆర్ఎస్ నేతల గుండెలు ‘గుబేల్’!

Posted: 06/22/2015 10:43 AM IST
Trs party leaders frightened when their mobile calling

నిన్నటిదాకా మొబైల్ ఫోన్లను విరివిగా వినియోగించిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఆ వాటిని వినియోగించేందుకు భయపడుతున్నారు. ఫోన్ మోగిందంటే చాలు.. జూనియర్ టు సీనియర్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట! ప్రస్తుతం వీరికి ఫోన్ వస్తే.. ముందుగా తమ పీఏలతో మాట్లాడించి.. ఆ తర్వాత సదరు ఫోన్ కాల్స్ ను మాట్లాడుతున్నారట! అది కూడా ఎక్కువ సంభాషణలు జరపకుండా కేవలం ‘కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాంలే’ అని పొడిపొడి మాటలతో ముగించేస్తున్నారట! అసలు ఇంతగా వీరందరూ ఎందుకు భయపడుతున్నారంటే.. ఇటీవలే ‘ఓటుకు నోటు’ వ్యవహారంతో వెలుగుచూసిన ‘ఫోన్ ట్యాపింగ్’ వీరిందరినీ ముచ్చెమటలు పట్టిస్తోందని సమాచారం!

ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ పార్టీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే తమ ఫోన్లపైనా హైకమాండ్ నిఘా పెట్టిందని టీఆర్ఎస్ నేతల్లో ఒకటే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కారణంగానే టీఆర్ఎస్ పార్టీ నేతలందరూ ఫోన్ లో మాట్లాడేందుకు కాస్త భయపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త నెంబర్లతో ఫోన్ వస్తే.. వారు బెంబేలెత్తిపోతున్నారట! అసలు వాటిని లిఫ్ట్ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదట! ఒకవేళ తెలిసిన నెంబర్ నుంచి కాల్ వస్తే.. ముందుగా తమ సహాయకుల చేత లిఫ్ట్ చేయించి.. ఆ తర్వాత పొడిపొడి మాటలు మాట్లాడి త్వరగా కట్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

మొత్తానికి ఈ ‘ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారం అటు టీడీపీ పార్టీనే కాకుండా ఇటు టీఆర్ఎస్ పార్టీ నేతల్ని బాగానే ముచ్చెమటలు పట్టించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం ఈ విషయంపై జోక్యం చేసుకోవడంతోనే టీఆర్ఎస్ పార్టీ నేతలు కాస్త అలర్ట్ అయినట్లు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : phone tapping  vote for note  trs party leaders  

Other Articles