Scorned husband gives ex half of everything he owns — literally

German man scorned by ex wife cuts items in half

Scorned husband gives ex half of everything he owns — literally, ex-wife, sawing, selling, ebay, revenge German man, ex-wife, cuts possessions, in half, divorce agreement, power tools, ex-wife half of everything, practically cut in half, objects, a chair, iPhone 5, a big-screen Samsung TV, teddy bear, mac book, car, bed, sofa set, e bay,

A German man seems to be following his divorce agreement to the letter by using power tools to give his ex-wife half of everything he owns.

ITEMVIDEOS: భార్యపై ఇలా పగ తీర్చుకున్నాడు..

Posted: 06/20/2015 03:26 PM IST
German man scorned by ex wife cuts items in half

తన మనస్సుకు నచ్చిన చెలి, తన గుండెలోనే నిదురించే సఖీ.. వయ్యారిగా మారి, తన హృదయాన్ని కవ్వించింది. తన గుండె గూటిలో.. గుడి కట్టి మరీ అమెను కోలువుంచాడు. అయితే మాత్రం పంచేంద్రియాలు మనుషులను శాసించడం మానుకుంటాయా..? కొత్తలో అయితే తన ప్రేమకు ముగ్దురాలైంది. ఆ తరువాత.. కొద్దిగా ప్రేమ తగ్గింది.. ఇలా క్రమేపి తన భర్తపై అమెకు ప్రేమ తగ్గింది. ఈ లోగా 12 ఏళ్లు గడిచాయి. దీంతో మనస్పర్థల కారణంగా మారిద్దరూ విడిపోయారు. అమె బలవంతం మేరకు భర్తకు కూడా విడాకులివ్వక తప్పలేదు.

అయితే తాను ఎంతగానో ప్రేమించి, ఆరాధించిన తన భార్య తనుకు విడాకులు ఇవ్వడంతో తట్టుకోలేక పోయిన భర్త అమెపై ప్రతీకారం తీర్చుకున్నాడు. అదేలా అంటారా..?.. మీరే చూడండి...

వివరాల్లోకి వెళ్తే.. జర్మనీకి చెందిన ఓ యువకుడు ..లారా అనే తన భార్యపై కోపంతో ...గతంలో తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాడిన వస్తువులన్నింటినీ సగానికి కోసేసి.. తన హృదయంతో పాటు సమస్తం రెండుగా విరిగిపోయని తన మాజీ జీవిత భాగస్వామికి చెప్పాలనుకున్నాడు. తన భార్య వెళ్ళిపోయాక అమె జ్ఞాపకాలు ఏవి తన వద్ద వుండకూడదని అనుకున్నాడో ఏమో.. అమెతో కలసి పంచుకున్న అన్ని వస్తువులను రెండుగా కోసేసాడు.

తాము ప్రయాణించిన కారు దగ్గర నుంచి... కూర్చునే కుర్చీ వరకూ అతగాడు ఏదీ వదలలేదు. టీవీ, సీడీలు, లాప్టాప్, సెల్ఫోన్, ఐఫోన్, సైకిల్, హెల్మెట్, సోఫా, బెడ్, చివరకు టెడ్డీ బేర్ బొమ్మను కూడా సగానికి చక్కగా కోసేసి... మాజీ భార్యకు పంపించాడు. అంతేకాకుండా ఈ నిర్వాకాన్ని మొత్తం వీడియో తీసీ యూట్యూబ్లో పెట్టాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావడటంతో అయ్యగారు తనవద్ద మిగిలి వున్న మిగతా సగ భాగాలను ఈబే మార్కెటింగ్ వెబ్‌సైట్‌లో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నాడు. మరక కూడా మంచిదే అన్నట్లు... 'సగం' కూడా  ఆ జర్మన్ యువకుడికి మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : German man  ex-wife  cuts possessions  in half  

Other Articles