BJP | LKAdvani | Emergency | Modi | Congress | Indira Gandhi

Bjp veteran lk advani said on his emergency remarks were not directed at any individual

BJP, LKAdvani, Emergency, Modi, Congress, Indira Gandhi

BJP veteran LK Advani said on his Emergency remarks were not directed at any individual but at the Congress, which he said should apologise for the events of 1975.

ITEMVIDEOS: ఎమర్జెన్సీపై అడ్వానీ వివరణ.. ఎవరినీ ఉద్దేశించినవి కాదు

Posted: 06/20/2015 10:06 AM IST
Bjp veteran lk advani said on his emergency remarks were not directed at any individual

దేశ రాజకీయాల్లో కురువృద్దుడిగా పేరున్న ఎల్.కె అడ్వానీ బాంబ్ పేల్చారు. దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ రాదు అని అని ఖచ్చితంగా చెప్పలేను అని చేసిన వ్యాఖ్యలపై అడ్వానీ వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే, రాజ్యాంగం-న్యాయరక్షణలకు విఘాతం కలిగించే శక్తులు చాలా బలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నాయకత్వం బలహీనంగా ఉందని, ఆ నాయకత్వంపై తనకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించారు. దేశ విభజన ఆనాటి బ్రీటిష్ ప్రభుత్వం చేసిన తప్పిదమని.. అయితే ఎమర్జెన్సీ మాత్రం మన పాలకుల నిర్వాకమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలా ఎల్.కె అడ్వానీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ సాగింది. రాజకీయ నాయకులల్లో ఎమర్జెన్సీ వార్త కలకలం సృష్టించింది.

దీనిపై కాంగ్రెస్ వర్గాలు బిజెపి నాయకత్వం మీద విమర్శల వర్షం కురిపించారు. మోదీ నాయకత్వం గురించే అడ్వానీ అలా వ్యాఖ్యలు చేశారని, సొంత పార్టీ నుండే విమర్శలకు మంచి ఆయుదం లభించినట్లు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే ఎల్.కె అడ్వానీ దీనిపై స్పందించారు. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కాదని అన్నారు. నాటి కాంగ్రెస్ పాలకుడ నిర్వాకం వల్లే దేశంలో ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చిందని అన్నారు. 1975లో జరిగిన ఎమర్జెన్సీ ఉదంతానికి 40 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమర్జెన్సీ గురించి వివరించడానికి ఏ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముందుకు రావడం లేదని అందుకే తాను ఎమర్జెన్సీ పరిస్థితిపై మాట్లాడుతున్నానని వివరించారు. మొత్తానికి బిజెపి పార్టీని ఇరుకున పెట్టిన అడ్వానీ వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చుకున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  LKAdvani  Emergency  Modi  Congress  Indira Gandhi  

Other Articles