Tamil Nadu | CM Jayalalithaa || Pak TV channel

Pakistan media channels praise jayalalitha

Tamil Nadu, CM Jayalalithaa, rice scheme, mosques,Pak TV channel, AIADMK, dmk, supply of free rice, gruel, fasting month, Ramzan

Pakistan media channels praise Jayalalitha . Pakisatn media appriciate Jayalalithas schemes for muslims in Tamilnadu..

పాకిస్థాన్.... జయలలిత ఫ్యాన్

Posted: 06/19/2015 01:12 PM IST
Pakistan media channels praise jayalalitha

ఆమె పేరు చెబితే అక్కడి ప్రజలు ఆనందంతో ఊగిపోతారు. ఆమె వస్తుందంటే బోర్లాపడి నమస్కారాలు చేస్తారు. ఆమె ఏం మాట్లాడినా జై జైలు కొడతారు. ఆమెకు ఎవరు ఎదురు మాట్లాడినా అస్సలు ఊరుకోరు. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా..? తమిళనాడు అమ్మ జయలలిత. అయితే తాజాగా జయలలిత మరోసారి వార్తల్లోకెక్కింది. తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన ఓ పథకంపై పాకిస్థాన్‌లో చర్చ జరుగుతోంది. అక్కడ కూడా ఆ స్కీం అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమిటా పథకం? ఎందుకు దానిపై అంత చర్చ?కాలానుగుణంగా కొత్త కొత్త పథకాలు తెస్తోంది తమిళనాడు ప్రభుత్వం. తాజాగా పవిత్ర రంజాన్ మాసంలో మసీదులకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే స్కీం తెచ్చింది. ఈ పథకంపై ఓ పాకిస్థాన్ ఛానెల్ ప్రశంసల జల్లుకురిపించింది. ఇలాంటి పథకాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ప్రవేశపెడితే బాగుంటుందని అభిప్రాయపడింది.

ఈ న్యూస్ ఆ దేశంలో శరవేగంగా పాకింది. అక్కడి ముస్లింలు... తమకు కూడా ఇలాంటి పథకం కావాలని డిమాండ్లు చేస్తున్నారు. రంజాన్ మాసం మొదలవ్వడంతో... తమిళనాడులోని 3వేల మసీదులకూ ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని ఇస్తోంది. మొత్తం 4వేల 500 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇందుకోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. రంజాన్ మాసంలో దీక్షలు చేసే ముస్లిం కుటుంబాలు... ఈ బియ్యాన్ని ఉచితంగా పొందనున్నాయి. సహజంగానే ఈ స్కీంపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముస్లింల అభివృద్ధికి ఎలాంటి చర్యలూ చేపట్టని ప్రభుత్వం... తాత్కాలిక తాయిలాలు ఇస్తోందని విమర్శించాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles