TRS | KTR | TTDP | MLA | Rajender Reddy | Vivek

Telangana telugudesam party mlas complaints to telangana acb on ktr

TRS, KTR, TTDP, MLA, Rajender Reddy, Vivek, Bribes, Telangana, ACB

Telangana Telugudesam party MLAs complaints to telangana ACB on KTR, Ttdp mlas complaints to acb for bribes to shift loyalties to the Ruling Party.

కేటిఆర్ పై తెలంగాణ ఏసీబీ కి ఫిర్యాదు

Posted: 06/18/2015 12:22 PM IST
Telangana telugudesam party mlas complaints to telangana acb on ktr

ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తెలుగుదేశం పార్టీ డైలామాలో పడింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో ప్రదర్శిస్తున్న దుందుడుకును తట్టుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. అయితే ఎలాగైనా తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చెయ్యాలనే ఉద్దేశంతో తెలంగాణ టిడిపి నేతలు తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఓ కేసు పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు ఆడియో విడుదలైనప్పుడు కూడా కేటీఆర్ వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఓ డిఎస్పీతో రాయభారం నడిపినట్లు ఎ ఛానల్ ఆడియో టేపులను విడుదల చేసింది. అయితే దానిపై కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నారు. అందులో తాను జోక్యం చేసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని అన్నారు. అయితే తాజాగా మరోసారి కేటీఆర్ టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.

టిఆర్ఎస్ పార్టీలోకి చేరాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్ రెడ్డి, వివేక్ లు తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. టిఆర్ఎస్ లో చేరాలని వత్తిడి చేస్తున్నట్లు వారు వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీలో చేరితే నిధులు, పదవులు ఇస్తామని తమను ప్రలోభపెట్టారని వారు వెల్లడించారు. పార్టీలో చేరకపోతే మాత్రం నియోజకవర్గ అభివృద్దికి ఏ విధంగానూ సహకరించబోమని కూడా బెదిరించారని, పార్టీ మారితే కార్పోరేషన్ పదవి ఇస్తామని కూడా వెల్లడించారు. అయితే ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్ఎస్ లోకి చేరిన మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వంద కోట్ల ప్యాకేజీ ముట్టినట్లు కూడా వారు తెలిపారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తెలంగాణ సర్కార్ టార్గెట్ గా చేస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు, ఐటి మంత్రి కేటీఆర్ ను టార్గెట్ గా చేసి తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. మరి దీనిపై తెలంగాణ ఏసీబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  KTR  TTDP  MLA  Rajender Reddy  Vivek  Bribes  Telangana  ACB  

Other Articles