ఏపి ప్రభుత్వం డిజిటల్ రంగంలో కొత్త పుంతలు తొక్కడానికి సిద్దపడుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని పలు ప్రదేశాల్లో ఫ్రీ వైఫై సర్వీసులను అందుబాటులో ఉంచింది. అయితే ఏపి ప్రభుత్వం కూడా ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేరువ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించాలని ఏపి ప్రభుత్వం నిర్ఱయించింది. తాజాగా ఏపి మంత్రి మండలి భేటిలో ఫైబర్ గ్రిడ్ పై నిర్ణయం తీసుకున్నారు. అసలే హైటెక్ బాబుగా పేరున్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కేబినెట్ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి కేవలం రెండు వందల రూపాయలతోనే 10 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక గంటపాటు ఫ్రీగా వైఫై సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే 2018 నాటి్కి విడతల వారిగా ఫైబర్ గ్రిడ్ ను ఏర్పాటు చెయ్యాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. కొండలు, గిరిజన ప్రాంతాల్లో శాటిలైట్ ల ద్వారా బ్రాడ్ బ్యాండ్ కు ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చెయ్యాలని కూడా ఏపి మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more