chains | train | indian railways | indian trains | trains | railways

No more chance to pull the chains to stop the trains

chains, train, indian railways, indian trains, trains, railways

To stop train pull chain" notice inside railway coaches is soon set to become history. The railway ministry has decided to do away with these chains. An official said railways had incurred a loss of Rs 3,000 crore because trains ran late with the indiscriminate chain-pulling for no good reason.

చైన్ లాగినా ట్రైన్ ఆగదోచ్

Posted: 06/09/2015 04:25 PM IST
No more chance to pull the chains to stop the trains

శివాజీ సినిమాలో రజినీకాంత్ ట్రైన్ పట్టాల మీద నిల్చుని తన ప్రేమను నిరూపించాలని అనుకుంటాడు. కానీ ట్రైన్ పట్టాల మీద నిలబడగానే రజినీకాంత్ కు చెప్పలేని భయం వస్తుంది దాంతో ట్రైన్ లో చైన్ లాగ మని లోపలే ఉన్న తన మనిషికి చెబుతాడు. అయితే ఇక మీదట పట్టాల మీదకు రజినీ కాంత్ వచ్చినా ఇంకెవరు వచ్చినా కానీ చైన్ లాగినా ట్రైన్ ఆగదు. ప్రాస బాగుంది కదా అని వాడుకున్నారు అనుకుంటున్నారేమో కానీ ఇది వార్త. చైనును లాగితే ట్రైన్ అగే పద్దతికి తొందరలోనే మంగళం పాడనుంది రైల్వే మంత్రిత్వశాఖ. చైన్ లాగడం వల్ల ట్రైన్ లు లేట్ గా వెళుతున్నాయని... దాంతో మూడు వేల కోట్ల  రూపాయలు నష్టం కలిగిందని అందుకే తాజాగా చైన్ కు బాయ్ బాయ్ చెబుతున్నట్లు రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఒకవేళ ట్రైన్ లో ఏదైనా ఎమర్జెన్సీ పడి ఆపాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారా..? ఇలాంటి వాటి కోసం ట్రైన్ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఫోన్ నెంబర్లు కనిపించేట్లు బోగీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యనున్నారు. ఇక మీదట తయారుచేసే కొత్త కోచ్ లలో ఎమర్జెన్సీ అలారం కూడా తీసివెయ్యనున్నారు. మొత్తానికి ట్రైన్ లో చైన్ లాగే అవకాశం అయితే ఇకమీదట ఉండబోదు మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chains  train  indian railways  indian trains  trains  railways  

Other Articles