ap | Telangana | chandrababu | KCR | Tapping

Who are the goats on the issues between the telangana and andhrapradesh

ap, Telangana, chandrababu, KCR, Tapping

Who are the goats on the issues between the telangana and andhrapradesh. Some people are very angry on the phone tapping issue.

బకరా ఎవరు..? చంద్రబాబా లేదంటే కేసీఆరా..?

Posted: 06/09/2015 01:53 PM IST
Who are the goats on the issues between the telangana and andhrapradesh

మొన్నటి దాకా కారాలు మిరియాలు దూసుకున్న వాళ్లు ఉన్నట్లుంది ఒక్కటవుతారు. అసలు స్వంత అన్నదమ్ముల్లాగా మెలుగుతారు. వీళ్లను చూస్తే ఎవరైనా అసూయపడేలా చేస్తారు. కానీ అంతలోనే కొట్టుకుంటారు. వాళ్ల పేరు చెబితేనే చిరాకు తెప్పించేస్తుంటారు. ఇంత ఇంట్రడక్షన్ ఎవరికి అనుకుంటున్నారా..? మన దేశంలో ఇంతకన్నా గొప్పగా ఎవరి గురించి చెప్పుకుంటాం.. ఒక్క రాజకీయ నాయకుల గురించి తప్ప. రాజకీయం అంటేనే సవాలక్ష లక్షణాలతో కూడిన వ్యక్తులు అన్నట్లు తయారవుతున్నారు రాజకీయనాయకులు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరీ వేడెక్కింది. ఒకరి మీద ఒకరు తిట్ల దండకం చదివేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మాటలు హద్దులు మీరుతున్నాయి. అయితే పార్టీల గొడవ దగ్గరి నుండి పర్సనల్ గొడవ వరకు వెళ్లింది. ఇక మీడియా వాళ్లు ఇవే మాటలను వేసిందే వేసి.. క్యాసెట్ అరిగిపోయేంత వరకు అదేదో భగవద్గీత అన్నట్లు వినిపిస్తూ ఉన్నారు.

అయితే ఓటుకు నోటుకు వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసింది. అయితే ఈ వివాదంతో ముందు రేవంత్ రెడ్డిని తర్వాత చంద్రబాబు వ్యవహారం మీద తెలంగాణ ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోంది. అయితే ఏపిలో ఏడాదికాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసంకల్ప దీక్షలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన కేసీఆర్ లు మాటల ఫిరంగులు పేల్చారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహారం కాస్తా రెండు రాష్ట్రాల వివాదంగా మారుతోంది. కేసీఆర్ మీద ఏపిలో చాలా చోట్ల కేసులు బుక్కయ్యాయి. ఇక చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మీ ఒక్కరి సొంతం కాదు మాకు కూడా హక్కు ఉంది అంటూ ఇష్యూను కొత్త ములుపు తిప్పారు. ఒకవేల చంద్రబాబు నాయుడు నిజంగా ఓటుకు నోటుకు వ్యవహారంలో పాలుపంచుకొని ఉంటే శిక్ష నుండి తప్పించుకోలేరు. అలాగే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపించి ఉంటే అతను కూడా చట్టం నుండి తప్పించుకోలేరు. అయితే వాళ్ల సంగతి ఏమో కానీ వీరిద్దరి మాటలు విని చాలా మంది ఆవేశంతో ఊగిపోతున్నారు. వారందరికి ఒక్కటే వినతి.. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాదం మాత్రమే. రెండు రాష్ట్రాల మధ్యో లేదా ఇంకోటో కాదు. కాబట్టి వార్తల మీద చర్చించికొని నవ్వుకోండి తప్పితే సీరియస్ గా మాత్రం తీసుకోకండి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ap  Telangana  chandrababu  KCR  Tapping  

Other Articles