AP, Telangana, KTR, KCR, Chandrababunaidu

Ap govt released the ktr conversation in the issue note for vote

AP, Telangana, KTR, KCR, Chandrababunaidu

Ap govt released the Ktr conversation in the issue note for vote. ap govt also counter attack on KTR and telangana govt.

ITEMVIDEOS: కేటీఆర్, కేసీఆర్ లూ తక్కువేం కాదు..!

Posted: 06/08/2015 07:43 AM IST
Ap govt released the ktr conversation in the issue note for vote

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ల మీద దాడికి సిద్దమైంది. అందులో భాగంగా వైరా ఎమ్మెల్యేతో పార్టీ జరిపిన మంతనాలను ఆధారంగా చూపుతోంది ఏపి ప్రభుత్వం. ఖమ్మం జిల్లా వైరా నుంచి వైసీపీ తరఫున గెలిచి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన మదన్‌లాల్‌కు అధికార పార్టీ రూ.3 కోట్లు ఆఫర్‌ చేసింది. ఈ విషయాన్ని వైరా డీఎస్పీ రామిరెడ్డి చెప్పారు. అది కూడా... టీఆర్‌ఎస్‌లో ముఖ్య నాయకుడైన కేటీఆర్‌ను ఉటంకిస్తూ, ఆయన స్వయంగా తనతో చెప్పారని, కేటీఆర్‌ మాటనే తాను చెబుతున్నానని తెలిపారు. దాంతో నిన్న చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ పీక్స్ చేరిన తరుణంలో.. కేటీఆర్, కేసీఆర్ లను తెర మీదకు తీసుకువస్తూ కొత్త ఆడియో టేపులను విడుదల చేసింది. దాంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యుద్దంగా తారా స్థాయికి చేరింది.

‘‘కిరణ్‌ కుమార్‌ రెడ్డి టైమ్‌లో పది, 20 లక్షలు ఇచ్చినా డీఎస్పీలకు పోస్టింగ్‌ రాలేదు. కానీ, నాకు వైరాలో ఫ్రీగా పోస్టింగ్‌ వచ్చింది. సైబరాబాద్‌ కావాలని కేటీఆర్‌ను కోరాను. అయితే, వైరాకు వెళ్లాలని ఆయన చెప్పారు. మదన్‌లాల్‌కు తాము 3 కోట్లు ఇచ్చినా తీసుకోలేదని, తన ఏరియా డెవలప్‌మెంట్‌ కావాలని మాత్రం కోరారని తెలిపారు. కేటీఆర్‌ మాటనే నేను చెబుతున్నాను’’ అని డీఎస్పీ రామిరెడ్డి తెలిపారు. వెరసి... విపక్ష ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ ప్రలోభ పెట్టిందనేందుకు ఇదే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. మరోవైపు... టీఆర్‌ఎస్‌ నుంచి తనకు ఆఫర్‌ వచ్చినప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరినట్లు మదన్‌లాల్‌ పలుమార్లు స్వయంగా పేర్కొన్నారు. మొత్తానికి తాజాగా కేసీఆర్ తనయుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓటుకు నోటు ఎపిసోడ్ లో పాలుపంచుకున్నట్లు ఏపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దాకా వెళుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Telangana  KTR  KCR  Chandrababunaidu  

Other Articles