Women agree to be raped, says Uttar Pradesh minister's latest shocker

Minister rakes up controversy says rapes happen when theres mutual consent

minister, Totaram Yadav, controversy, rape, mutual consent, women, Current affairs, Rape, uttar pradesh minister Totaram Yadav, Uttar Pradesh minister's latest shocker

Totaram Yadav, who enjoys the status of a minister in the Akhilesh government, stirred up a major row, when he said that rape takes place with mutual consent

యువతుల అంగీకారంతోనే అత్యాచారాలు...? దుమారం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు

Posted: 06/07/2015 01:58 PM IST
Minister rakes up controversy says rapes happen when theres mutual consent

యావత్ ప్రపంచంలో దేశం పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్న అత్యాచార పర్వాలపై ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిల పరస్పర అంగీకారంతోనే అత్యాచారాలు జరుగుతుంటాయంటూ యూపీకి చెందిన మంత్రి తోతారామ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. మెయిన్‌పురి జిల్లా కారాగారాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాచారం అంటే ఏమిటి? అలాంటిదేమీ లేదని, పరస్పర ఆమోదంతోనే అవి జరుగుతాయని పేర్కొన్నారు. బలవంతంగా జరిగేవి, ఆమోదంతో జరిగేవి అనే రెండు విభాగాలుగా అత్యాచారాలను విభజించవచ్చని ఆయన సెలవిచ్చారు.

ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రంలో పెరిగిపోతున్న అత్యాచారాలను నియంత్రించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విచిత్రమైన సమాధానమిచ్చారు. ‘‘రేప్‌ అంటే ఏమిటి? అలాంటిదేమీ ఉండదు. రేప్‌లు కుర్రాళ్లు, అమ్మాయిల పరస్పర అంగీకారంతోనే జరుగుతాయి’’ అని ఆయన పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు ‘‘రేప్‌లు రెండు రకాలు. ఒకటి.. బలవంతంగా చేసేవి. రెండు.. పరస్పర అంగీకారంతో జరిగేవి’’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై విలేకరులు వివరణ కోరగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.

దీంతో అత్యాచారం అంటే.. ఒకరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా చేసే లైంగిక దాడని తెలియకుండానే ఆయన మంత్రి ఎలా అయ్యారన్న విమర్శలు కూడా వినపబడుతున్నాయి. గతంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ సైతం ’కుర్రాళ్లన్నాక, తప్పు చేస్తార’ని వ్యాఖ్యానించారు. మరి అలాంటి పార్టీలోనే మంత్రిగా కోనసాగుతున్న తోతారామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో విస్మయం చెందాల్సిన అవసరమేముందని, ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా..? అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Totaram Yadav  controversy remarks  rape  mutual consent  

Other Articles