TDP, mallareddy, KCR, Chandrababu,

Tdp mp mallareddy chant kcr name

TDP, mallareddy, KCR, Chandrababu,

TDP Mp Mallareddy chant KCR name. Telugudesam party Mp Mallareddy praise the Telangana cm KCR that he is the best cm and he can make golden telangana.

మల్లారెడ్డి మతలబు ఏందో.?

Posted: 06/05/2015 03:57 PM IST
Tdp mp mallareddy chant kcr name

తెలుగుదేశం పార్టీ ఎంపీ మల్లారెడ్డి.. పార్టీ బద్దశత్రువుగా భావించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. పొగడ్తలు అంటే మామూలుగా కాదు అబ్బో అంతా ఇంతా కాదు అన్నంతగా తెగ కేసీఆర్ భజన చేశారు మల్లారెడ్డి. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టం. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం మంచి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు. మల్కాజ్ గిరి ప్రాంతానికి కేసీఆర్ వందల కోట్లు కేటాయించి ఈ ప్రాంత అభివృద్దికి కృషిచేశారు. కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది పేదలకు కేసీఆర్‌ స్వాతంత్య్రం ఇచ్చారని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని, కేసీఆర్‌ నాయకత్వంలో రాబోయే రెండేళ్లలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదని, రాష్ర్టాభివృద్ధిలో సీఎం కేసీఆర్‌కు అందరం అండగా నిలబడదామని మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మల్కాజిగిరి ప్రాంతానికి సీఎం వందల కోట్లు కేటాయించి ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేశారన్నారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,300 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. త్వరలో మల్లారెడ్డి పార్టీ మారనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మల్లారెడ్డి వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర లేపాయి. మరి మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారో.. తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  mallareddy  KCR  Chandrababu  

Other Articles