Jagan, Chandrababu, Promises, elections

Jagan mohan reddy attacked on narachandrababu naidu

Jagan, Chandrababu, Promises, elections

Jagan Mohan reddy attacked on narachandrababu naidu. jagan Mohan reddy talk about the promises at the time of elections.

జగన్ సభలో చంద్రబాబు

Posted: 06/04/2015 04:50 PM IST
Jagan mohan reddy attacked on narachandrababu naidu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, వైసీపీ అధినేత వైయస్ జగన్ కు అస్సలు పొసగదు అని అందరికి తెలుసు. కానీ తాజాగా మంగళగిరిలో సమరదీక్ష చేస్తున్న జగన్ సబలొ మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షమయ్యారు. అవును మీరు చదువుతున్నది నిజం. జగన్ సభలొ చంద్రబాబు అన్నది వాస్తవం. కానీ చంద్రబాబు వచ్చింది స్క్రీన్ మీద. అవును జగన్ సభలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద ఎల్సీడీ స్క్రీన్ ల మీద చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష మయ్యారు. అయితే అక్కడ చంద్రబాబు ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల గురించి వైసీపీ నేత జగన్ ఏర్పాటు చేసిన స్పెషల్ షో అది.

ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు.. నిజానికి జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వివరిస్తు వైసీపీ వీడియో పుటేజ్ లను సభలో ప్రసారం చేసింది. చంద్రబాబు నాయుడు నోటి నుండి వచ్చిన హామీలను హైలెట్ చేస్తూ.. వీడియోలు సాక్షాలుగా ప్రదర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలివి. ఆయన ఊరూరా ఇదే మాటలు చెప్పారని జగన్ అన్నారు. ఏ టీవీ ఆన్ చేసినా వినిపించే మాటలివే... జాబు కావాలంటే బాబు రావాలని అన్నారని జగన్ తెలిపారు. తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు  హామీలన్నీ సమైక్యరాష్ట్రంలో ఇచ్చాను, వాటిని అమలుచేయడం ఇప్పుడు సాధ్యం కాదని అన్నారని జగన్ వెల్లడించారు. ఈ హామీలన్నీ మీరు చూశారు. ఎన్నికలప్పుడు ఇలాగే చంద్రబాబు మీ వద్దకు వచ్చి ఇలాగే అడిగారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులంతా చేతులు పైకెత్తాలని అడిగారు. బంగారం బ్యాంకుల్లో పెట్టిన ఆడపడుచులు చేతులు పైకెత్తాలన్నారు. చేతులన్నీ పైకి లేచాక.. మీ రుణాలన్నీ నెలలోనే మాఫీ చేస్తామని ఇదే చంద్రబాబు అన్నారు. ఉద్యోగం కోసం పిల్లలు వెతుక్కుంటే, వాళ్లనూ వదిలిపెట్టలేదు. ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తాను, ఇవ్వలేకపోతే 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మన రాష్ట్రంలో రెండు మ్యానిఫెస్టోలు విడుదల చేశారు. ఒకటి తెలంగాణ, మరొకటి సీమాంధ్రకు అన్నారు. మొత్తానికి జగన్ సమర దీక్షలో అటు చంద్రబాబు వీడియోలు, జగన్ ఆడియోలు అదిరిపోయాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jagan  Chandrababu  Promises  elections  

Other Articles