YSRCongress, Book, Jagan, Rastraniki Mosagadu

Ysrcongress party leader ysjagan launch the rastraniki mosagadu book

YSRCongress, Book, Jagan, Rastraniki Mosagadu

YSRCongress party leader YSjagan launch the Rastraniki Mosagadu book. In samaradeksha jagan launch the book on nara chandrababu naidu.

ఆ కాంగ్రెస్ సీడీ.. ఈ కాంగ్రెస్ బుక్కు

Posted: 06/04/2015 03:30 PM IST
Ysrcongress party leader ysjagan launch the rastraniki mosagadu book

తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్న పదాలు వినే ఉంటారు. తెలుగు రాష్ట్రాల విభజన సమయం వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వైయస్ జగన్ స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వంతులు వేసుకున్నట్లున్నాయి. అందుకే ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి వంతులు వేసుకొని మరీ సిడిలు, బుక్కులు రిలీజ్ చేస్తున్నారు. మొన్న అదిరిందయ్యా చంద్రం పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏపి శాఖ సిడిని విడుదల చేసింది. అందులో చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల గురించి ప్రస్తావిస్తు.. అధికారంలోకి వచ్చాక హామీల అమలులో చేస్తున్ననిర్లక్షం మీద ఆ సీడీలో ప్రశ్నించింది. అయితే సరే కాంగ్రెస్ పార్టీ ఎలాగూ సీడీని విడుదల చేసింది కదా.. మరి మనం ఓ బుక్ ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుందో ఏమో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే తాజాగా జగన్ చేస్తున్న సమర దీక్షలో జగన్ రాష్ట్రానికి మోసగాడు పేరుతో బుక్ రిలీజ్ చేశాడు.

సమరదీక్ష సాక్షిగా చంద్రబాబు మోసాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  'రాష్ట్రానికి మోసగాడు' పుస్తకాన్ని విడుదల చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ వద్ద చేపట్టిన సమరదీక్ష రెండోరోజు కూడా కొనసాగుతోంది. ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనేది 'రాష్ట్రానికి మోసగాడు' పుస్తకంలో అన్ని వివరాలు విపులంగా ఉన్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకమని అన్నారు. టీడీపీ ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు, అమలు జరుగుతున్న తీరుతెన్నులు తదితర అంశాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయని చెవిరెడ్డి తెలిపారు. మొత్తానికి 80 పేజీల ఈ బుక్ లో చంద్రబాబు ఇచ్చిన హామీలు.. అమలు జరుగుతున్న తీరు తదితర వివరాలను జీవోలతో సహా వివరించారు. అందుకే సాక్షి ఈ బుక్ ను తన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCongress  Book  Jagan  Rastraniki Mosagadu  

Other Articles