Narachandrababu, Revanthreddy, C.Ramchandrayya, Telangana

Narachandrababu naidu agree his mistake

Narachandrababu, Revanthreddy, C.Ramchandrayya, Telangana

Narachandrababu naidu agree his mistake. Congress party senior leader C.Ramchandrayya said that chandrababu agree his mistake by maintain silence.

తప్పు ఒప్పుకున్న చంద్రబాబు

Posted: 06/03/2015 03:27 PM IST
Narachandrababu naidu agree his mistake

అవును.. ఏపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన తప్పును ఒప్పుకున్నారట. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత సి. రామచంద్రయ్య వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు మౌనంగా ఉండటమే తప్పు చేశాడనటానికి నిదర్శనయని అన్నారు.  రేవంత్ కేసుపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి.అదే విధంగా పార్టీ అధ్యక్ష పదవికి కూడా చంద్రబాబు రాజీనామా చేయాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అవినీతి, రాజకీయ కుట్రల వల్ల రాష్ట్రాన్ని రెండుగా విభజన చేయించటం చంద్రబాబు దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖ ఇచ్చిన చంద్రబాబు కుట్రలో భాగస్వామ్యం అని ఒప్పుకుంటారా అని రామచంద్రయ్య ప్రశ్నించారు. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యాలకు కారణాలేంటో చెప్పాలని చంద్రబాబును ఈ సందర్భంగా రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

అలా రేవంత్ రెడ్డి కేసులో అసలు సూత్రిధారి అని కొంత మంది విమర్శలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు మీద మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మరింత పదునెక్కాయి. అసలు రేవంత్ రెడ్డి కేసులో ఏ1 నిందితుడిగా నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంబటి రాంబాబు అయితే అంతా చంద్రబాబు నాయుడే నడిపించాడు కాబట్టి ఆయన్ను ముందు అరెస్టు చెయ్యండి అంటున్నారు. ఇక తాజాగా పీతల సుజాత ఇంట్లో డబ్బుల సంచి వ్యవహారం మరోసారి చంద్రబాబును ఇరకాటంలో పడేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Narachandrababu  Revanthreddy  C.Ramchandrayya  Telangana  

Other Articles