Videos, Health, Nutrition, women and child development department

Watch the videos and get ten rupees

Videos, Health, Nutrition, women and child development department

Watch the videos and get ten rupees. New offer announcement from ministry of women and child development, that the videos on Health and nutritions.

ఒక వీడియో చూస్తే పది రూపాయలు ఇస్తారట

Posted: 06/03/2015 01:38 PM IST
Watch the videos and get ten rupees

అవును..మీరు చదివింది అక్షరాల నిజం. మామూలుగా అయితే ఏదైనా వీడియో మనం నెట్ లో చూడాలంటే ముందుగా నెట్ బ్యాలెన్స్ వేయించుకోవాలి. కానీ తాజాగా ఓ ఆపర్ అందరిని తెగ ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏంటా ఆపర్ అనుకుంటున్నారా..? ఓ వీడియో చూడండి.. పది రూపాయలు పొందండి అన్న ఆపర్. అవును వీడియో చూస్తే చాలు పది రూపాయలు ఇచ్చేస్తారట. అయితే ఇంకెందుకు ఆలస్యం మనకిష్టమైన వీడియోలు చూద్దామని అందరు అనుకుంటున్నారేమో.. కానీ అదంతా కుదరదు. ఎందుకంటే ఇక్కడ కండీషన్స్ అప్లై అని చిన్న చుక్క మార్క్ ఉంది. ఇంతకీ ఏంటా కండీషన్ అనుకుంటున్నారా..? వీడియోలు చూడాల్సింది మహిళలు పైగా చూడాల్సిన వీడియోలు హెల్త్ అండ్ న్యూట్రిషన్ కు సంబందించినవి.

గ్రామీణ మహిళకు మొబైల్ ఫోన్ల ద్వారా ఆరోగ్యం - పౌష్ఠికాహారం గురించి అవగాహన కల్గించేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ. ఈ అంశాలకు సంబంధించి 18 భాషల్లో రూపొందించిన నాలుగు వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని వీక్షిస్తే 10రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తారు. 2018 నాటికి రెండున్నర కోట్లమంది గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా మంగళవారం ఈ పథకం ప్రారంభమైంది. ఇండియన్ అకాడెమీ ఆఫ్ పిడియాట్రిక్స్, యునిసెఫ్, హెల్త్ ఫోన్ -వోడాఫోన్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వీడియోలని వోడాఫోన్ చందాదారులకు మాత్రమే ఉచితంగా అందజేస్తారట. మొత్తం నాలుగు వీడియోలనూ డౌన్‌లోడ్ చేసుకుని చూస్తే రూ.10 ప్రోత్సాహకం. యునిసెఫ్ లెక్కల ప్రకారం, ఐదేళ్ల లోపు పిల్లల్లో 48 శాతం మంది పౌష్ఠికాహార లోపం వల్ల కలిగే సమస్యలతో బాధపడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో ఆపర్ భలే బాగుంది కదా..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Videos  Health  Nutrition  women and child development department  

Other Articles