Harish Rao, PawanKalyan, Narachandrababu Naidu, Revanth Reddy

Harish rao attacks on tdp president narachandrababu naidu

Harish Rao, PawanKalyan, Narachandrababu Naidu, Revanth Reddy

Harish Rao attacks on TDP president Narachandrababu naidu. Harish Rao used Pawankalyan dialouges to attack on chandrababu naidu.

పవన్ డైలాగులే చంద్రబాబు మీద పంచులు

Posted: 06/02/2015 01:13 PM IST
Harish rao attacks on tdp president narachandrababu naidu

నారా చంద్రబాబు నాయుడు మీద తెలంగాణ నేతలు మాటల తూటాలు పేలస్తున్నారు. టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో వెనకుండి మొత్తం కథను నడిపించింది పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే అంటూ తెలంగాణ నేతలు చంద్రబాబు మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీ పప్పులు ఉడకడం లేదని.. అందుకే ఇలా దొడ్డి దారిన వస్తున్నారని అంటున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ విమర్శల్లో ఏదో స్పెషాలిటి ఉంటేనే కదా మీడియాలో వార్తలకెక్కేది. తాజాగా ఓ తెలంగాణ మంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల్లోని డైలాగును వాడుతూ.. చంద్రబాబు మీద విమర్శలు చేశారు. ఇంతకీ ఎవరా నేత..? ఏంటా విమర్శా..? అన్న సందేహం కలిగిందా. అయితే మొత్తం చదవండి.

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగులు చాలా ఫేమస్ అన్న విషయం అందరికి తెలుసు. అయితే ఇవే డైలాగులను చంద్రబాబు నాయుడు మీదకు పంచుల్లా విసురుతున్నారు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావ్. రేవంత్ రెడ్డి వ్యవహారం మీద మాట్లాడిన హరీష్ రావ్.. చంద్రబాబు గురించి ప్రజలకు తెలుసు అంటూనే కేక డైలాగ్ వాడారు. నేను కత్తి లాంటోడిని.. కూరగాయలు తరుగుతా.. మెడ కాయలు నరుకుతా.. అంటూ పవన్ డైలాగ్ ఉంది. అయితే దీన్నే హరీష్ రావ్తనస్టైల్లో చెప్పారు. కత్తిలో కేక్ కట్ చెయ్యగలరు.. అదే కత్తిలో మెడ కాయలు కొయ్యగలరు అని విమర్శించారు. తెలంగాణలో పార్టీకి ఏ మాత్రం పుట్టగతులుండవని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు హరీష్ రావ్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harish Rao  PawanKalyan  Narachandrababu Naidu  Revanth Reddy  

Other Articles