Narachandrababunaidu, Navanirmana deksha

Narachandrababu naidu speech at navanirmana deksha in vijayawada

Narachandrababunaidu, Navanirmana deksha

narachandrababu naidu speech at navanirmana deksha in vijayawada. Narachandrababu naidu praise the NTR and oppose the Indira Gandhi.

అయ్యా.. చంద్రబాబు ఏం చెప్పాలనుకున్నావ్..?

Posted: 06/02/2015 11:10 AM IST
Narachandrababu naidu speech at navanirmana deksha in vijayawada

నారా చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ప్రారంభించిన నవ నిర్మాణ దీక్షలో ప్రసంగిస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రసంగం స్టార్ట్ అయిన దగ్గరి నుండి అందరికీ బోర్ గా అనిపిస్తోంది. గత ప్రసంగాల్లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు ప్రసంగాల్లో ఏ మాత్రం కొత్త దనం లేదు. మహానాడులో మాట్లాడినట్లే ఎన్టీఆర్ గురించి, తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడారు. అయితే టీవీల్లో వచ్చే లైఫ్ బాయ్ సోప్ యాడ్ ఈ సందర్భంగా గుర్తుకు వచ్చింది. చిన్న పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోండి అంటూ.. కడుగుతూనే ఉండు కడుగుతూనే ఉండు.. అంటే వెంటనే మరో చిన్న అమ్మాయి వచ్చి ఓయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ..? అని అడుగుతుంది. ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు స్పీచ్ లో ఏ మాత్రం స్పీడ్ లేదు. అలాగే స్పెషాలిటీ కూడా లేదు.

తాజాగా విజయవాడలో చేస్తున్న నవనిర్మాణ దీక్షలో నారా చంద్రబాబు నాయుడు పాత పాటనే పాడారు. తెలుగు వారి అభివృద్ది కోసం వారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగేదేశం పార్టీ అని నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ మీద మరోసారి తీవ్ర ఆరోపణలు చేసారు. ఇందిరా గాంధీ తెలుగు జాతిని అవమానించారని.. కానీ తర్వాత తెలుగు జాతి ఔనత్యాన్ని తెలుసుకొని ఎన్టీఆర్ ను గౌరవించుకున్నారని అన్నారు. అలా ప్రారంభం నుండి ఎన్టీఆర్, ఇందిరాగాంధీల పేర్లతోనే ఊపేశారు. అసలు నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలనుకున్నాడు..? ఎందుకు నవ నిర్మాణ దీక్ష పెట్టారు..? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ సమావేశంలో మాట్లాడినట్లే శరా మామూలుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababunaidu  Navanirmana deksha  

Other Articles