Telugudesamparty, TDP, Narachandrababu naidu, National media, Revanth Reddy

Telugudesamparty leader revanth reddy follwing tdp president narachandrababu naidu

Telugudesamparty, TDP, Narachandrababu naidu, National media, Revanth Reddy

Telugudesamparty leader revanth reddy follwing TDP President Narachandrababu naidu. National media cover chandrababu naidu over expense for his tour after that national media telecast Revanth Reddy news.

అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి తప్పేంటి??

Posted: 06/01/2015 04:00 PM IST
Telugudesamparty leader revanth reddy follwing tdp president narachandrababu naidu

రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. తెలంగాణలో టిడిపికి పెద్ద ఝలక్. రేవంత్ రెడ్డి అరెస్టుతో తెలంగాణలో మారిన ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం. ఇలా రకరకాల వార్తలు మీడియాలో హల్ చేస్తున్నాయి. స్టీఫెన్సన్ కు యాభై కో్టలు ఇవ్వచూపిన కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి.. చంచల్ గూడ జైలు తరలించారు పోలీస్ అధికారులు. అయితే రేవంత్ రెడ్డి తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాటలోనే నడుస్తున్నారు. అదేంటి చంద్రబాబు నాయుడు ఇలా అవినీతి చేస్తూ పట్టుబడినట్లు ఎప్పుడూ వార్తలు రాలేదే.? అనుకుంటున్నారా.. అయితే పోలిక అందులో కాదు వేరే విషయంలో ఇంతకీ ఎందులో ఇద్దరికీ పోలిక అనుకుంటున్నారా.. అయితే చదవండి

కొత్తగా ఏర్పడిన ఏపికి పెట్టుబడులు తేవడం కోసం అంటూ ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబారా ఖర్చులు చేశారు. టూర్ల పేరుతో అంతం మాత్రం ఉన్న ఏపి ఖజానాకు కొత్త చిల్లు పెట్టారు చంద్రబాబు నాయుడు. అయితే ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు దుబారా ఖర్చు అంటూ జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. అయితే తాజాగా మరోసారి జాతీయ మీడియా తెలుగు రాష్ట్రాల మీద వార్తలు రాసేలా చేశారు రేవంత్ రెడ్డి. తమ గురువు గారి బాటలోనే రేవంత్ కూడా జాతీయ మీడియాలో విపరీతమైన కవరేజ్ సంపాదించారు రేవంత్ రెడ్డి. మొత్తానికి గురువు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి అంటున్నారు కొంత మంది. మరి ఇట్లాంటి విషయాలతో మీడియాకు ఎక్కేవాళ్ల గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలా అంటూ గాలికి వదిలేసే మామూలు జనం వీటి గురించి పట్టించుకోవడం లేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugudesamparty  TDP  Narachandrababu naidu  National media  Revanth Reddy  

Other Articles