Andhra Girl Uppalapati Priyanka Gets Top Rank In TS Eamcet | Telangana Boy Gets First Rank in Ap Eamcet

Andhra girl uppalapati priyanka gets top rank in ts eamcet

uppalapati priyanka, telangana eamcet, kadiya srihari, andhra pradesh eamcet, engineering eamcet results, telangana eamcet results, uppalapati priyanka updates, telangana girls

Andhra Girl Uppalapati Priyanka Gets Top Rank In TS Eamcet : A student from Prakasam district in Andhra Pradesh secured first rank in the agriculture and medical stream of first Telangana Engineering Agriculture and Medical Common Entrance Test (TS Eamcet).Uppalapati Priyanka from Prakasam district scored 160 out of 160 marks and topped agriculture and medical stream test. And in the engineering stream Moparthi Sai Sandeep topped by scoring 157 out of 160.

ఎంసెట్ ‘సీన్ రివర్స్’.. టీఎంసెట్ లో ఆంధ్రా అమ్మాయి టాప్ ర్యాంక్

Posted: 05/29/2015 10:48 AM IST
Andhra girl uppalapati priyanka gets top rank in ts eamcet

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా నిర్వహించిన ఎంసెట్‌ల ఫలితాలు ఎంతో ఆసక్తికరంగా వచ్చాయి. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో ఏపీ పరీక్షలో తెలంగాణకు చెందిన అబ్బాయి కాడ శ్రీవిధుల్ మొదటి ర్యాంకును కైవసం చేసుకోగా.. తాజాగా గురువారం విడుదలైన తెలంగాణ పరీక్షలో ఏపీకి చెందిన అమ్మాయి ఉప్పలపాటి ప్రియాంక మొదటి ర్యాంకు సాధించింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ అమ్మాయి.. మెడిసిన్ ఎంసెట్ లో 160కి 160 మార్కులు (100%) సాధించి టాపర్ గా నిలిచింది.

అయితే.. ఇంజనీరింగ్ విభాగంలో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ తెలంగాణ విద్యార్థులే మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన మోపర్తి సాయి సందీప్ మొదటి ర్యాంకును కైవసం చేసుకోగా... అటు ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలోనూ హైదరాబాద్‌కు చెందిన కొండపల్లి అనిరుధ్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించాడు. మొత్తంగా తెలంగాణ ఎంసెట్ మెడిసిన్ విభాగంలో టాప్-10 ర్యాంకులు సాధించిన వారిలో ఐదుగురు తెలంగాణకు చెందిన వారున్నారు. కాగా.. మరో ఐదుగురు ఏపీకి చెందిన విద్యార్థులు. తెలంగాణ ఇంజనీరింగ్‌లో మాత్రం టాప్-10లో ఎనిమిది మంది తెలంగాణరాష్ట్ర విద్యార్థులు కాగా.. ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఏపీకి చెందినవారున్నారు.

ఇదిలావుండగా.. హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలంగాణ ఎంసెట్ ఫలితాలు, ర్యాంకులను విడుదల చేశారు. విద్యార్థులకు ఎంసెట్‌లో వచ్చిన స్కోర్‌కు వారు ఇంటర్ సాధించిన మార్కుల వెయిటేజీ (25 శాతం) కలిపి ఈ ర్యాంకులను ప్రకటించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ శైలజారామయ్యార్, సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్, ఎంసెట్ కన్వీనర్ రమణరావు, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జేన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలో కూడా సెమిస్టర్ విధానాన్ని అమలుచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ ఎంసెట్ కోసం మొత్తంగా 2,32,047 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈనెల 14న నిర్వహించిన పరీక్షకు 1,28,162 మంది హాజరయ్యారు. ఇందులో 90,556 మంది విద్యార్థులు (70.65 శాతం) అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,365 మంది దరఖాస్తు చేసుకోగా.. 84,659 మంది పరీక్ష రాశారు. అందులో 72,794 మంది (85.98 శాతం) విద్యార్థులు అర్హత సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uppalapati priyanka  ts eamcet results  sai sandeep  

Other Articles