Narachandrababu | Mahanadu | speech | Gandipet

Narachabdrababu opening speech in mahanadu today

Narachandrababu, Mahanadu, speech, Gandipet

Narachabdrababu opening speech in Mahanadu today. TDP party president speech in mahanadu. chandrababu touch all topics about the telugu states.

మహానాడులో చంద్రబాబు ఏమన్నారంటే

Posted: 05/27/2015 01:05 PM IST
Narachabdrababu opening speech in mahanadu today

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు ప్రలోభాలకు లొంగి పార్టీ వీడి పోయినా.. వచ్చే నష్టం ఏదీ లేదని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గండిపేటలో తెలుగుదేశం పార్టీ 34వ మహానాడు సందర్భంగా చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. మంత్రిపదవులకోసం తలసాని శ్రీనివాసయాదవ్, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఇతరులు పార్టీ వీడిన విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు. టీడీపీ పాలనలో పదవులు అనుభవించి వెన్నుపోటు పడిచిన వారెందరో ఉన్నా, పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇతర పార్టీల వారు కొనుక్కొన్నా, పార్టీ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. పార్టీ బలహీన పడలేదన్నారు. దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. అధికారంకోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదని చంద్రబాబు అన్నారు. దేశంలో ప్రజలకు అవసరమైన ఎన్నో సంక్షేమ పథకాలు మొదట ప్రవేశపెట్టినది టిడీపీ ప్రభుత్వమేననన్నారు. తెలుగుదేశం పార్టీని వామపక్షాలు కూడా గౌరవించాయన్నారు చంద్రబాబు. దేశంలో 54 లక్షల మంది టిడీపీ కార్యకర్తలుగా పేరు నమోదు చేసుకున్నారన్ని వివరించారు. టిడీపీ హయాంలోనే అటు తెలంగాణ ఇటు ఆంధ్రా అభివృద్ధి చేశాయన్నారు చంద్రబాబు. తెలుగు అభిమానం ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందన్నారు. క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని వివరించారు. రెండు ప్రాంతాల అభివృద్ధి తెలుగుదేశం లక్ష్యమన్నారు.

*కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని అవమానించింది
*ప్రతిపక్షలో పదేళ్లున్నా పోరాటం చేశాం
*కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తెలుగుజాతికి నష్టం కలిగింది
*పోలవరం కు ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోతాయి.
* మహానాడు వేదికపై పదేపదే ఎన్డీయార్ పేరు పటించిన చంద్రబాబు
*పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు 24 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
*రైతులు గౌరవంగా బతకాలి వ్యవసాయం లాభసాటిగా సాగాలి
*టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుంటాం
*సంస్కరణలు, సరికొత్త పథకాలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ
*సముద్ర తీరాన్ని సమర్థవంతంగా వినయోగించుకొని పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తాం
*భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాం
*కాంగ్రెస్ హయాంలొో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
*గత ఏడాది ప్రవేశపెటట్టిన పథకాల మీద సమీక్ష నిర్వహించి ముందుకు సాగుతాం
*కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు అన్నీ కాంట్రాక్టర్ లను ఉద్దరించడానికే
*బిందు సేద్యం, తుంపర సేద్యానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తాం
*రుణ విముక్తికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.
*చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రుణమాఫీకి సిద్దపడింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే
*ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  Mahanadu  speech  Gandipet  

Other Articles