TDP | TRS | Mahanadu | Plenary | Food

All parties in telugu states follow the same strategy in the plenary

TDP, TRS, Mahanadu, Plenary, Food

All parties in telugu states follow the same strategy in the plenary. TRS and recently TDP party arranging super food for karyakartha and leaders.

ఆ ఒక్క విషయంలో అన్ని పార్టీలు ఒక్కటే

Posted: 05/27/2015 09:48 AM IST
All parties in telugu states follow the same strategy in the plenary

అవును ఒకపార్టీ అంటే ఒకపార్టీ వారికి అస్సలు కుదరకపోవచ్చు. వీలుదొరికినప్పుడల్లా నోటికి పని చెబుతూ.. అప్పుడప్పుడు అవకాశం దొరికితే చేతులకు కూడా చెబుతుంటారు మన నేతాగణం. అయితే ఒక్క విషయం అన్ని పార్టీలు ఒకేలా ఫాలో అవుతున్నాయి. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? ఇంకేంటి పార్టీ ప్లీనరీలు కానివ్వండి లేదా వేరే ఏవైనా సభలు కానివ్వండి ఘుమఘుమలు అదిరిపోవాలి. ఎంత మంది వచ్చినా లేదనకుండా అదిరిపోయేలా వంటలు వడ్డించడంలో అన్నిపార్టీలు ఒకేలా ఫాలో అవుతున్నాయి. పార్టీ సభల్లో జనాలు తిని ఊళ్లోకి వెళ్లి మరీ చెప్పుకోవాలని పార్టీల ఆరాటం. మెనూ కార్డ్ ఎంత పెద్దగా ఉంటే అంత పేరు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి  పార్టీలు.

కుదిరితే ముప్పై .. వీలైతే ఓ యాభై ఇలా వంటకాల సంఖ్యను పెంచుతూ వచ్చిన వారి కడుపు నిండేలా మనసు ఆనందించేలా వంటకాలు సిద్దం చెయ్యడంలో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. మొన్న జరిగిన టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో పలావ్ గురించి అయితే కార్యకర్తలు ఇంకా మాట్లాడుకుంటున్నారు. దాదాపు నలభై వేల మంది జనాలకు అదిరిపోయే విందు పెట్టి ఓహో అనిపించుకున్నారు టిఆర్ఎస్ పార్టీ నేతలు. తాజాగా తెలుగుదేశం పార్టీ మహానాడులోనూ అదే పాలోఅవుతున్నారు. మహానాడుకు వచ్చే దాదాపు యాభై వేల మంది కార్యకర్తలకు, నేతలకు దాదాపు 34 రకాల శాఖాహార వంటలు వడ్డించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. రాగి పంకటి నుండి పూత రేకుల వరకు అన్ని రకాల వంటకాలు దాదాపు మూడు వందల మంది వంటగాళ్లు సిద్దం చేస్తున్నారు. పైగా మీడియా వాళ్లు కూడా ఇలాంటి సభల్లో ముందు వంటల గురించే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  TRS  Mahanadu  Plenary  Food  

Other Articles