Petrol | Bikes | Vehicles | Temperature

Petro companies warn on tankfull petrol in vehicles

Petrol, Bikes, Vehicles, Temperature

petro companies warn on tankfull Petrol in vehicles. On the purpose of record level high temperatures.

వద్దు వద్దు.. ట్యాంక్ ఫుల్ పెట్రోల్ వద్దు

Posted: 05/22/2015 11:34 AM IST
Petro companies warn on tankfull petrol in vehicles

ఎండలు మండుతున్నాయ్.. అవును మండడం అంటే మామూలుగా మండటం కాదు బాబోయ్ ఏకంగా జనాల్ని చంపేస్తున్నాయి. అయితే ఎండలకు భయపడి చాలా మంది ఇళ్లలోనే ఉంటున్నారు. కొంత మంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తోంది. అయితే ఆ వచ్చే వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ జాగ్రత్తలు పాటించకపోతే సూర్యుడు మాత్రం మొహం వాచేలా ఎండతో చంపేస్తున్నాడు. రోహిణి కార్తె రాకుండానే భానుడి ప్ర‌తాపం ఇలా ఉండ‌డంతో ఇక రోహిణి ప్ర‌వేశిస్తే ఎలా ఉంటుందోన‌ని ప్రజ‌లు భ‌య‌ప‌డి పోతున్నారు. ఎండాకాలం… దీంతోపాటు మారిన వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయిల్ కంపెనీలు పెట్రోలు వినియోగ‌దారులకు విలువైన సూచ‌న‌లు చేశాయి.

ఏంటీ ఆయిల్ కంపెనీలు ఎందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నాయి అనుకుంటున్నారా..? జనరల్ గా చాలా మంది సాలరీలు రాగానే తమ వెహికిల్స్ లో పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయిస్తుంటారు. డబ్బులు ఉంటాయో లేదో అని చాలా మంది ఇలా చేస్తుంటారు. త‌మ వాహ‌నాల్లో పెట్రోలు నింపుకునే స‌మ‌యంలో ట్యాంకు నిండా నింపుకోవ‌ద్దని, ప్రస్తుత ఉష్ణోగ్రత‌ల ప్రభావంగా ట్యాంకుల నిండా పెట్రోలు ఉంటే అవి పేలిపోయే ప్రమాదం ఉంద‌ని, ఇలాంటి ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా చేయాలంటే వినియోగ‌దారులు ఈ జాగ్రత్త తీసుకోవాల‌ని ఆయిల్ కంపెనీలు ముందుజాగ్రత్తగా సూచించాయి. పెట్రోలు ట్యాంకుల నిండా నింప‌డం వ‌ల్ల ప్రమాదాలు జ‌రిగి ఐదుగురు ఇప్పటివ‌ర‌కు చ‌నిపోయార‌ని ఆయిల్ కంపెనీలు వివ‌రించాయి. మరి మీరు చాలా విలువైన ఈ హెచ్చరికను పాటించి.. మీ వెహికిల్ లో ట్యాంక్ ఫుల్ చేయించకండి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Bikes  Vehicles  Temperature  

Other Articles