green taxi | kolkata | Dhannunjay

Green taxi in kolkata roads attracts people view

green taxi, kolkata, Dhannunjay, taxi, plants

The 40-year-old drives an Ambassador with a bed of real grass on its roof, eight potted plants placed on the tray behind the rear seat and a green interior to go with his message to save the environment and take care of trees.

ITEMVIDEOS: ట్యాక్సీలందు ఈ గ్రీన్ ట్యాక్సీ వేరయా

Posted: 05/21/2015 01:57 PM IST
Green taxi in kolkata roads attracts people view

వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.. ఇలా మండుతున్న ఎండల్లో నడవలేక మీరు ఓ ట్యాక్సీని పిలిచారు. అందులో ఏసీ ఉంది. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది.. ఎక్సలెంట్ కదండి. కానీ ఒకవేళ ఏసీ లేకుండా చెట్ల చల్లటిగాలి మీకు ఆనందాన్ని ఇస్తే ఎలా ఉంటుంది. కలకత్తాకు వెళితే అక్కడ మీకు ఓ ట్యాక్సీ దొరుకుతుంది. అబ్బో కోల్ కత్తాలో ట్యాక్సీ దొరుకుతుంది కానీ ముందు మ్యాటర్ చెప్పండి అంటారా.. అయితే చూడండి ఓ గ్రీన్ టాక్సీ కనిపిస్తుంది. అక్కడ దొరికే గ్రీన్ ట్యాక్సీ చూస్తే ఎప్పుడు ట్యాక్సీ అవసరం ఉన్నా అదే గుర్తుకు వస్తుంది. అంతలా ఏసీ లేకపోయినా ఏసీని మించిన చల్లదనం.. గ్రీనరీ మీకు ట్యాక్సీలో కూర్చున్న ఫీలింగ్ ను రానివ్వదు. ఇంతకీ అంతలా ఆకట్టుకుంటున్న గ్రీన్ ట్యాక్సీ విశేషాలు మరిన్ని మీ కోసం.



కోల్ కతాలో ధనుంజయ్ చక్రబర్తి అనే వ్యక్తి ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.అయితే తను నడిపే ట్యాక్సీ అన్ని ట్యాక్సీల్లా కాకుండా డిఫరెంట్ గా ఉండాలని ఆలోచించాడు. అలా ఆలోచన నుండే గ్రీన్ ట్యాక్సీ పుట్టింది. మామూలు ట్యాక్సీనే కానీ దాన్ని గ్రీన్ ట్యాక్సీగా మార్చారు ధనుంజయ్. ట్యాక్సీ పై భాగాన పచ్చటి గడ్డిని పెంచడమే కాకుండా ట్యాక్సీ లోపల కూడా చిన్న చిన్న చెట్లను పెంచుతున్నారు ధనుంజయ్. దాంతో ట్యాక్సీకి కొత్త లుక్ రావడమే కాకుండా ఎక్కిన ప్యాసింజర్ కు చల్లదనం కూడా దొరుకుతోంది. మామూలు ట్యాక్సీ ఛార్జీలనే తీసుకుంటున్న గ్రీన్ ట్యాక్సీ అంటే కోల్ కతాలో చాలా ఫేమస్ అయింది. మరి మీకు వీలుంటే కోల్ కతా గ్రీన్ ట్యాక్సీ ఎక్కండి..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : green taxi  kolkata  Dhannunjay  taxi  plants  

Other Articles