kcr | osmania university | lands

Telangana cm kcr clear that he dont fear about anything

telangana, cm. kcr, osmania university, lands, poor, houses

Telangana cm kcr clear that he dont fear about anything. Cm KCR said that govt will construct houses for poor people in osmania university lands. But some leaders and students oppose the kcr decision.

కేసీఆర్ అంతే.. ఎవరికీ భయపడడంట..!

Posted: 05/19/2015 04:10 PM IST
Telangana cm kcr clear that he dont fear about anything

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అందరికి తెలుసు. తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. అనుకున్నది సాదించే వరకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటారు అన్న విషయం అందరికి తెలుసు. అయితే తాజాగా పేదలకు ఇళ్లను ఉస్మానియా యూనివర్సిటి భూముల్లో నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంత మంది నేతలు. కొంత మంది విద్యార్థి నేతలు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడమే కాకుండా, దిష్టిబొమ్మ దహనాలు కూడా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకొం అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.

తాజా పరిణామాలపై సిఎం కేసీఆర్ స్పందించారు. తను ఎలాంటి వాడినో తనదైన స్టైల్లో వివరించారు. ఒక పని మొదలు పెడితే మధ్యలో వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తాను మొండివాడినని, అనుకున్నది సాధించే వరకు నిద్రపోనని చెప్పారు. ఓయూలో కొంత స్థలం తీసుకుని పేదలకు ఇళ్లు కట్టిస్తానని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు కడతామంటే కొందరు తన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నాయకులు వీరిని భుజానికి ఎత్తుకుంటున్నారని ఆరోపించారు. వందలు, వేల ఎకరాల్లో యూనివర్సిటీలు అవసరం లేదని, ఇది రాజుల కాలం కాదని అన్నారు. హైదరాబాద్ లో రేసు కోర్సులకు గోల్ఫ్, పేకాట క్లబ్బులకు వందల ఎకరాలు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టడం తప్పా అని ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేసే విషయంలో తాను ఎవరినీ భయపడనని కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికి పేదల ఇళ్లు ఖచ్చితంగా కట్టి తీరతానని స్పష్టం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  cm. kcr  osmania university  lands  poor  houses  

Other Articles