Narachandrababu | Jagan | memory loss

Nara chandrababu naidu suffering from memory loss

Narachandrababu, Jagan, memory loss, ap, promises

Nara chandrababu naidu suffering from memory loss. YSR Congress leader ys jagan clear that babu suffering with memory loss.

చంద్రబాబుకు మెమొరీ లాస్..!

Posted: 05/19/2015 08:21 AM IST
Nara chandrababu naidu suffering from memory loss

అరవయేళ్ల వయస్సులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉండే నారా చంద్రబాబు నాయుడుకు తాజాగా ఓ వ్యాధి వచ్చిందని.. దాంతో అతడికి హామీలు ఏవీ గుర్తుకులేవని అంటున్నారు ఏపి ప్రతిపక్షనేత వైయస్ జగన్. గత ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఇంత వరకు కనీసం ఊసెత్తలేదని.. బహుశా మతిమరుపు వ్యాధి సోకిందని అంటున్నారు. రుణమాఫీ, నిరుద్యోగ బృతిలాంటి హామీలను చంద్రబాబు ఎప్పుడో మరిచిపోయారని అన్నారు. వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఓట్లేయించుకుని ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రజానీకానికి పంగనామాలు పెట్టారు. బాబు మాటలు నమ్మిన బడుగులు నిలువునా మోసపోయార’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  అన్నారు.

అయితే అలా చంద్రబాబు నాయుడు మరిచిపోయిన హామీలను గుర్తు చెయ్యడానికి తాను గుంటూరులో నిరాహార దీక్షలు చేపడతానని వైయస్ జగన్ స్పష్టం చేశారు. కాగా జగన్ ఇలా చంద్రబాబుకు హామీలు గుర్తు చెయ్యడానికి నిరాహార దీక్ష చేస్తాననడంపై అప్పుడే సెటైర్లు వినిపిస్తున్నాయి. అయ్యా.. జగను చంద్రబాబు హామీలు మరిచారనే అనుకుందాం.. కానీ మీరు నిరాహార దీక్ష చేస్తే ఆయనకు ఎలా గుర్తుకువస్తుంది అని కొంత మంది అప్పుడే చెవులు కొరుక్కుంటున్నారు. ఓ రకంగా చూస్తూ అదీ నిజమే అనిపిస్తోంది. మరి జగన్ దీక్షతో చంద్రబాబుకు గుర్తుకు వచ్చి హామీలు నెరవేరుస్తారా అని చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  Jagan  memory loss  ap  promises  

Other Articles