Teen dead named Zack Clements for 20 minutes claims he saw Christ perform a miracle

Zack clements teen dead for 20 minutes claims he saw christ perform a miracle

Zack Clements, american teenage boy, Christ perform miracle, athletic Zack Clement, Jesus saved me, miracle by Jesus, Zacks family

Zack Clements Teen dead for 20 minutes claims he saw Christ perform a miracle : Fit and athletic Zack Clements says he received visit from man with thick beard who put a hand on his shoulder and told him "everything would be alright"

అమెరికాలో విచిత్రం.. చనిపోయిన కుర్రాడిని ‘జీసస్’ బతికించాడట!

Posted: 05/18/2015 11:35 AM IST
Zack clements teen dead for 20 minutes claims he saw christ perform a miracle

ఈ సృష్టిలో కొన్నికొన్ని చోట్ల అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరి జీవితాల్లో అనుకోని విచిత్రాలు జరుగుతుంటాయి. ఉదాహరణగా చెప్పుకుంటే.. పదేళ్ల అమ్మాయి బామ్మగా ప్రవర్తించడం.. ఐదేళ్ల అమ్మాయి 400 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పడం.. ఇలా ఎన్నోరకాల విచిత్రాలు ఇప్పటికే చోటు చేసుకున్నాయిలెండి! అయితే.. అమెరికాలో చోటుచేసుకున్న సంఘటన మాత్రం యావత్తు జగత్తును ఆశ్చర్యంలో ముంచెత్తించేసింది. ఇంతకీ ఆ విచిత్రం ఏమిటంటారా? అది తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్ బ్రౌన్ వుడ్ లో జాక్ క్లెమెంట్ (17) అనే హైస్కూల్ సాకర్ ఆటగాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్ లో భాగంగా స్ప్రింట్ సాధన చేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పల్స్ కూడా పడిపోయింది. అక్కడే వున్న వైద్యులు ఇతడిని పరీక్షించగా.. హృదయస్పందన లేకపోవడంతో మరణించినట్లుగా ప్రకటించారు. దీంతో కొద్దిసేపటివరకు అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. కానీ.. కాసేపటికి అతడి నాడి కొట్టుకోవడం ప్రారంభించింది. అది గమనించిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇదెలా సాధ్యం? అంటూ నోళ్లవేళ్లబెట్టుకున్నారు. అప్పుడు అతడిని వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఫోర్ట్ మౌత్ లోకి కుక్ చిల్డ్రన్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొంది.. ఆ అబ్బాయి తిరిగి మామూలు మనిషయ్యాడు.

చావుబతుకుల నుంచి కోలుకున్న జాక్ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలోనే అతడు మాట్లాడుతూ.. తాను కదలలేని పరిస్థితిలో పడివున్నప్పుడు తనకు పొడవైజ జుట్టు, గుబురు గడ్డంతో వున్న వ్యక్తి కనిపించాడని.. దాంతో అతడు ఆ వ్యక్తిని ‘జీసస్’గా గుర్తుపట్టానని వివరించాడు. అప్పుడు తాను పైకి లేయగా ఆయన తన భుజంపై చేయివేసి.. అంతా బాగవుతుందని, బాధపడాల్సిన పనిలేదని చెప్పినట్లుగా తెలిపాడు. ఆ యువకుడు ఈ విధంగా చెప్పిన వ్యాఖ్యలను విన్నవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చనిపోయిన ఇతడిని ‘జీసస్’ కాపాడాడంటూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. అయితే.. కొందరు మాత్రం నమ్మలేదు.

ఇదే వ్యవహారంపై జాక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుటుంబం ఒక దివ్యమైన అద్భుతాన్ని చవిచూసిందని చెప్పారు. దీనిపై తండ్రి బిల్లీ మాట్లాడుతూ.. కొందరు తన కుమారుడు చెబుతున్న దానిని అంగీకరించడం లేదనీ, కానీ తమ కుటుంబం మాత్రం ఓ అద్భుతం చూసిందని చెప్పారు. ఇక జాక్ తల్లి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. జీసస్ తమ కుమారుడిని బతికించాడని ఆ కుటుంబం చెప్పుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zack Clements  Jesus Miracles  

Other Articles