CM kcr phone to planning commission vice president neeranjanreddy

Cm calls planning commission vice president niranjan reddy drags public attention

CM calls planning commission vice president niranjan reddy, drags public attention, telangana chief minister KCR, planning commission vice president niranjan reddy, public meeting, marri janardhan reddy, mahaboob nagar, KCR phone, bijinepalli, neti aauyog programme, bhopal,

telangana chief minister KCR calls planning commission vice president niranjan reddy, while he was in public meeting drags public attention

సీఎం ఫోన్.. నిశబ్ధంగా మారిన బహిరంగసభ.. అంతా ఉత్కంఠ

Posted: 05/14/2015 03:47 PM IST
Cm calls planning commission vice president niranjan reddy drags public attention

ప్రజల్లో నాయకుల పట్ల వుండే అభిమానానికి ఎన్నికలే కొలమానం కాదు. ఓట్లు, సీట్లు, అధికారం అనేవి వున్నా, లేకున్నా ఫలానా నాయకుడు అనగానే ఓహో అతగాడా.. చాలా మంచోడ్రా అని చర్చించుకుంటారు. అయితే అభిమానం వేరు.. అధికారం వేరు. అధికారంలో వున్న నాయకులపై ప్రేమాభిమానాలు ఎలా వున్నయో తెలసుకునేందుకు ఈ అరుదైన ఘటన సాక్ష్యంగా నిలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభోత్సవానని పురస్కరించుకుని అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

సబ్ స్టేషన్ ను ప్రారంభించన అనంతరం సభలో అతిధిగా వున్న ఉన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఫోన్ గిర్రున మ్రోగింది. అంతే అతగాడు సభ్యలో ప్రసంగిస్తున్న స్థానిక శాసనసభ్యుడు మర్రి జనార్థన్ రెడ్డి వద్దకు వెళ్ళి తనకు ఫోన్ వచ్చిందని చెప్పాడు. అదే విషయమై సభలో అతిధులతో పాటు సభికులకు కూడా ఆయన తన వద్దనున్న మైక్ లో విషయాన్ని చెప్పారు. అంతే అప్పటి వరకు ప్రసంగాన్ని వింటున్నవారితో పాటు సభలో ఇతరులతో ముచ్చటిస్తున్న వారు అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా వుండిపోయారు. పిన్ డ్రాప్ సైలెన్స్ గా సభ మారిపోయిందంటే నిజమండీ..? ఇంతకీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి మైక్ లో ఏం చెప్పాడు..? నిరంజన్ రెడ్డి కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌చేశారని . అంతే బహిరంగ సభ కాస్తా.. క్లాస్ రూమ్ గా మారిపోయింది.

అంతా ఉత్కంఠగా నిరంజన్ రెడ్డి వైపే సూస్తున్నారు. సీఎం ఏం మాట్లాడుతున్నారు..? దానికి నిరంజన్ రెడ్డి ఎలా బదులిస్తున్నారన్న విషయాలను వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ తో నిరంజన్ రెడ్డి ఫోన్ సంబాషణ ముగిసేంత వరకు ఆక్కడంతా ఉత్కంటభరిత వాతావరణం అలుముకుంది. నిరంజన్ రెడ్డి విషయాన్ని చెబుతారని అక్కడి వారు అలానే తీక్షణంగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈనెల 27న భూపాల్‌లో జరిగే నీతిఅయోగ్ కార్యక్రమంలో పాల్గొనే విషయంపై తనతో సీఎం మాట్లాడారని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటించడంతో.. సభలో ఆనందం వెల్లివిరిసింది. అయితే నీతి అయోగ్ గురించి సభలోవారికి తెలియకపోయినా.. సీఎం కేసీఆర్ పంపుతున్నారని తెలియగానే.. నిరంజన్ రెడ్డి అనుకూలం నినాదాలు వ్యక్తమయ్యాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR phone  planning commission visepresident  neeranjanreddy  public meeting  

Other Articles