Telangana | Fitment | KCR,

Telangana govt may announce 43percent fitment today afternoon

Telangana, Fitment, KCR,

Telangana govt may announce 43percent fitment today afternoon. Telangana cm kcr ready to give rtc employees fitment.

ఫిట్ మెంట్ 43శాతం ఓకే..!

Posted: 05/13/2015 08:02 AM IST
Telangana govt may announce 43percent fitment today afternoon

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం చర్చల్లో 38 నుంచి 40 శాతం వరకు కార్మిక సంఘాల్ని ఒప్పించేందుకు ప్రయత్నించింది. దీన్ని కార్మిక సంఘాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు సిఎం అంగీకరించారని, నేడు ఆయనే స్వయంగా ప్రకటన చేస్తారని సమాచారం. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కార్మిక సంఘాలతో భేటీ అయ్యి, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడతారని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రజా సంబంధాల శాఖ అధికారులు పత్రికా కార్యాలయాలకు సమాచారం ఇచ్చారు. కార్మికుల సమ్మెపై ఇప్పటికే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా వచ్చినా, సిఎం కెసిఆర్‌ మాత్రం వారి ప్రధాన డిమాండ్‌ 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Fitment  KCR  

Other Articles