Betting | Fighting | Hyderabad

Betting and fightings are very common in the streets of hyderabd

Betting, Fighting, Hyderabad, social media, video, teenage, youth

Betting and fightings are very common in the streets of hyderabd. The youth misleading by some forces. youngsters think fighting is a fashion.

నాయనా.. మీరు హీరోలు కాదు..స్ట్రీట్ ఫైట్స్ వద్దయ్యా

Posted: 05/11/2015 07:08 PM IST
Betting and fightings are very common in the streets of hyderabd

తాజాగా హైదరాబాద్ లో జరిగిన స్ట్రీట్ ఫైట్ పై సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఓ వ్యక్తి మృతి చెందిన తర్వాత కానీ హైదరాబాద్ పాతబస్తీ లాంటి ప్రదేశాల్లో ఏం జరుగుతోందో బయటిలోకానికి తెలియదు. అయితే స్ట్రీట్ ఫైట్ గురించి తప్పుపట్టడం కన్నా.. దానికి అవకాశం కల్పించడంపైనే మనం మాట్లాడుకోవాలి. అంటే ఉద్దేశం స్ట్రీట్ ఫైట్ కల్చర్ సిటీ యూత్ ను పెడదారి పట్టిస్తోంది. పేరెంట్స్ బిజీ లైఫ్.. పిల్లలపై ప్రభావం చూపుతోంది. కంట్రోల్ లేకపోవటంతో.. విచ్ఛలవిడి తత్వం పెరిగిపోతోంది. హైదరాబాద్ లో బైక్ రేస్, కార్ రేసులతోపాటు.. స్ట్రీట్ ఫైటింగ్ కూడా హాబీగా మారింది. ప్రాణాపాయమని తెలిసినా.. ఉడుకు రక్తం.. వెనక్కితగ్గటంలేదు. ప్రాణాలు పోయాక తేరుకుని.. లబోదిబోమంటున్నారు తల్లిదండ్రులు. సినిమాల ఎఫెక్ట్ టీనేజ్ పై ఫుల్ గా ఉంటోంది. సినిమాల్లో చేసేవి డూప్ ఫైట్లయినా.. రియల్ లైఫ్ లో హీరోల్లా ఫీలైపోతున్నారు యూత్. సిక్స్ ప్యాక్ లపై చూపుతున్న ఇంట్రెస్ట్.. ఎడ్యుకేషన్ పై చూపటంలేదు. తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోకపోవటంతో.. బలాదూర్ గా మారిపోతున్నారు. చెడుమార్గంలో నడుస్తున్నారు.

స్ట్రీట్ ఫైట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో జరిగిన స్ట్రీట్ పైటింగ్ఖ సీన్లకు పాపులారిటీ పెరడగం విశేషం. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రియల్ ఫైటింగ్ సీన్లు.. పిల్లలపై ఫుల్ ఎఫెక్ట్ చూపుతున్నాయి. రియల్ ఫైటింగ్ సీన్లకు అట్రాక్ట్ అవుతున్న టీనేజర్లు.. ఎవరికి వారు హీరోల్లా ఫీలవుతున్నారు. పంచ్ లకు రెడీ అంటున్నారు. హైదరాబాద్ గల్లీల్లో స్ట్రీట్ ఫైటింగ్ కల్చర్ పెరిగిపోతోందనే ఆరోపణలు గతంలోనే వినిపించాయి. టీనేజ్ లో తల్లిదండ్రుల భయం పిల్లలకు లేకపోవడంతో పిల్లలకు స్వేచ్ఛ పరిధులు దాటుతోంది ఇలా తమ పరిధిని దాటిన పిల్లలు ఏకంగా బెట్టింగ్ లకు దిగుతున్నారు. నబీల్ లాంటి యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడే..  రియాక్టవుతున్నారు పోలీసులు. రియల్ హీరోల్లా ఫీలవుతున్న యువకులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. యూత్ లో పరివర్తన తెచ్చే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు విద్యావేత్తలు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Betting  Fighting  Hyderabad  social media  video  teenage  youth  

Other Articles