Celllphone | bullet | MP

A cellphone saved a life in madhyapradesh

Celllphone, bullet, MP, Indore, Life

a cellphone saved a life in madhyapradesh. In madhyapradesh, some unknown persons fired on nikhilesh. He saved by his cell phone. The bulllet went into his pocket and in the pocket there is a cel phone.

ప్రాణాన్ని కాపాడిన సెల్ ఫోన్

Posted: 05/11/2015 05:48 PM IST
A cellphone saved a life in madhyapradesh

సెల్ ఫోన్...ఇప్పుడో విప్లవం. అత్యంత ఆధునికమైన సాంకేతిక పరికరం. పని చేస్తున్నా, తింటున్నా, ఆఖరికి నిద్రలోనూ మొబైల్ ఫోన్ వెన్నంటి ఉండాల్సిందే. సెల్ ఫోన్ లేని లైఫ్ ఊహించలేం అంటే అతిశయోక్తి కాదు. అంతలా సెల్ ఫోన్ మన జీవితాలతో పెనవేసుకుపోయింది. అయితే సెల్ ఫోన్ ఉపయోగం ఎక్కువ కావడం వల్ల అనేక దుష్ప్రయోజనాలు కలుగుతున్నాయన్న వాదనలూ లేకపోలేదు. సెల్ ఫోన్ కాదు..హెల్ ఫోన్ అనేవాళ్లూ లేకపోలేదు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. సెల్ ఫోన్ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. అవును నిజం, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిఖిలేష్ అనే క్రీడాకారుడు.. కాస్తలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అది కూడా కేవలం తన మొబైల్ ఫోన్ కారణంగానే.

అదేంటి సెల్ ఫోన్ తో ప్రాణాలు ఎలా నిలబెట్టారు అని అనుకుంటున్నారా.. కొంపదీసి ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ కు ఫోన్ చెయ్యడానికి ఫోన్ వాడాడా అన్న అనుమానం కలుగుతుందేమో లేనే లేదు. డైరెక్ట్ గా సెల్ ఫోనే ఇక్కడ మనిషి ప్రాణాలను కాపాడింది. మ్యాటర్ లోకి వెళితే.. ఓ పెళ్లి వేడుకకు హాజరైన నిఖిలేష్ పై హత్యాయత్నం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి గన్ తో కాల్పులు జరిపాడు. అయితే ఆ బుల్లెట్ వెళ్లి డైరెక్ట్ గా నిఖిలేష్ పాకెట్ కు తగిలింది. కానీ అదృష్టం ఏమిటంటే అదే పాకెట్ లోని ఉన్న మొబైల్ ఫోన్ ని బుల్లెట్ తాకింది. అలా నిఖిలేష్ సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తానికి అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ అతడి ప్రాణాలను కాపాడిందన్న మాట. సూపర్ కదా.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Celllphone  bullet  MP  Indore  Life  

Other Articles