AAP | Aam admi party | Media

Aam admi party leaders decided to file cases on media

AAP, Aam admi party, Media, cases, file, stories

Aam admi party leaders oppose the media behaviour. The media publishing and telecosting anti aap stories from last three four months. Kejiwal fired on media in the last time aap meeting.

మీడియా పై సమరానికి సై అంటున్న పార్టీ

Posted: 05/11/2015 01:40 PM IST
Aam admi party leaders decided to file cases on media

నదిలో ఉన్నప్పుడు ఓడ మల్లన, ఒడ్డు చేరాక బోడ మల్లన అన్న చందంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తోంది. పార్టీ ప్రారంభం నుండి, ఢిల్లీలో పార్టీ అధికార పగ్గాలను చేపట్టే వరకు అసలు బలంగా ఉన్న మీడియానే ఇప్పుడు ఆప్ టార్గెట్ గా చేసుకుంది. గతంలో మీడియా వారికి రాచమర్యాదలు చేసి పంపే ఆప్ నాయకులు ఇప్పుడు మాత్రం వారి మీదకు కారాలు, మిరియాలు నూరుతున్నారు. అసలు తమ పార్టీని నాశనం చెయ్యడానికే మీడియా తమకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తోందని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. పార్టీకి సంబందించిన ఏ వార్త వచ్చినా దాన్ని అన్నింటి కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, పబ్లిసిటీ చేసే మీడియా ఇప్పుడు మాత్రం తమకు వ్యతిరేకంగా కక్షకట్టినట్లు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపేలా కథనాలను ప్రసారం చేస్తోందని ఆప్ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడుతున్నారు.

ఢిల్లీలో మొదటిసారి పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ ప్రతి కదలికను మీడియా విపరీతంగా కవర్ చేసింది. గంట గంటకు అప్ డేట్ లు కూడా వేసింది. అయితే అప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కేజ్రీవాల్ తో సహా కొంత మంది చేసిన రాజకీయాలకు సంబందించిన ఆడియో టేపులు బయటపడ్డాయి. అయితే ఆ ఆడియో టేపులకు సంబందించి మీడియా ఆప్ కుటిల రాజకీయాలు, నీచ రాజకీయాలు అంటూ భారీగా కధనాలు ప్రచురించిది మీడియా. దాంతో అప్పటి దాకా ప్రజా బలం కన్నా మీడియా బలంతో ముందుకు దూసుకెళుతున్న ఆప్ పార్టీలో కలవరం మొదలైంది. పార్టీని దిగజారుస్తూ మీడియాలో వస్తున్న కథనాలపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. తాజాగా మీడియా కథనాలపై కేసులు కూడా వెయ్యాలని తమ పార్టీకి, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారంగా కథనాలు ప్రసారం చేసిన, ప్రచారం చేసినా కోర్టును ఆశ్రయించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. తమ పార్టీని నామరూపాలు లేకుండా చెయ్యడానికే మీడియా కంకణం కట్టుకుందని ఆరోపణలు చేశారు. అయితే తమకు సపోర్ట్ గా కథనాలువేసినపుడు ఏమీ అనని ఆప్ నేతలు ఇప్పుడు మాత్రం మీడియా మీద మండిపడుతున్నారని, వారి డ్యుటి వారు చేస్తున్నారు కదా అని కొందరు ఆప్ ను ప్రశ్నిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Aam admi party  Media  cases  file  stories  

Other Articles