Former IPS officer Kiran Bedi Says Will Not Contest Elections Again | Delhi Assembly Elections

Kiran bedi says will not contest elections again

kiran bedi news, delhi assembly elections, arvind kejriwal, bjp party, lady ips officers, women economic forum, panaji, india country

Kiran Bedi Says Will Not Contest Elections Again : Former IPS officer Kiran Bedi, who was BJP's chief ministerial candidate for Delhi Assembly polls held earlier this year, today said that she will not contest elections again.

రాజకీయాల నుంచి తప్పుకున్న కిరణ్ బేడీ

Posted: 05/11/2015 10:55 AM IST
Kiran bedi says will not contest elections again

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పోటీచేసి ‘ఆప్’ పార్టీ చేతిలో ఘోరంగా పరాజయం చవిచూసిన తొలి మహిళ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ ఇకనుంచి రాజకీయాల్లో పోటీ చేయనని స్పష్టం చేసింది. తనకు ప్రజా సేవ చేయాలని ఉందని మాత్రం ఆమె తెలియజేసింది కానీ... అందుకు క్రియాశీల రాజకీయాలను మాత్రం ఎంచుకోనని అన్నారు. రాజకీయం తన భాష కాదని.. అది తనకు సూటవదన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లో పోటీ చేయనని ఆమె తెలిపింది.

వుమెన్ ఎకానిమిక్ ఫోరం కార్యక్రమంలో భాగంగా ఆదివారం పనాజీకి వచ్చిన కిరణ్ బేడీ.. ఢిల్లీ రాజకీయాలపై అడిగిన మీడియా ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. ‘నేను ప్రజా సేవచేయడానికి మళ్లీ  వస్తున్నా. కానీ రాజకీయాల్లోకి రాను. రాజకీయం అనేది నా  భాష కాదు. అందుచేత తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు’ అని తెలిపింది. ఢిల్లీ ఎన్నికలు అనేవి తన జీవితంలో ఒక మరిచిపోలేని అనుభూతిగా ఆమె అభివర్ణించింది.

బీజేపీ పార్టీ తనకు ఢిల్లీ సీఎం అభ్యర్థిగా పోటీచేసేందుకు ఇచ్చిన అరుదైన అవకాశం తన జీవితానికి ఎంతోగానో ఉపయోగపడిందని.. అందుకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా బేడీ తెలిపింది. తన జీవితం పలు విషయాల్లో ఉన్నతస్థితిలోనే సాగిందని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kiran bedi  arvind kejriwal  delhi assembly elections  

Other Articles